తాజాగా కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సలు  అంతటి  ఉన్నత విద్యావంతురాలైన దిశ ఆపద సమయంలో ఆమె ధైర్యం ఎందుకు కోల్పోయిందనేది ఆలోచించాల్సిన విషయమని చైర్‌పర్సన్ శోభ పేర్కొన్నారు . అంతేకాదు దిశ చివరిసారిగా చెల్లెలికి ఫోన్‌ చేసి మాట్లాడిన విధానం కానీ లేదా ఆ  సమయంలో ఆమె వాయిస్‌ కాల్‌ వింటే తను తల్లితండ్రులకు టచ్‌లో ఉండదన్న విషయం  తెలుస్తోందని అన్నారు.

 

ఇక ఆమె మొదటిగా  తన తండ్రికి కాకుండా చెల్లెలికి  ఎందుకు ఫోన్‌ చేసింది  ఏదైనా ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు మన తల్లితండ్రులకు కానీ పోలీసులకు కానీ తెలియజేయాలి కానీ ఆమె ఆలా చేయలేదు దింతో  చైర్‌పర్సన్ శోభ సందేహం వ్యక్తం చేశారు.చైర్‌పర్సన్ శోభ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి సంఘటన కొంచమైనా తాగించుటకు  పిల్లల పట్ల తల్లితండ్రులు ఎలా ఉండాలో వారికీ మంచి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు రోడ్డు మీద దిశ లాంటి ఘటనలు  జరుగుతుంటాయని, వాటిని ఎవరైనా సరే  ఎలా ఆపగలరని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆపాదించడం సరైంది కాదని అన్నారు.

 


మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసుల చర్యను అంటే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అందరూ ప్రశంసిస్తుంటే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత భిన్నంగా స్పందించడం​ గమనార్హం. ఆలేరు ఎమ్మెల్యే సునీత నిందితులను పోలీసులు  ఎన్‌కౌంటర్‌ చేయడం బాధాకరమని  అంటూ నిందితుల తల్లితండ్రులు ఎంతో బాధపడి ఉంటారని ఆమె ఆవేదన చెందారు.

 

 ఆమె ప్రగాఢ సానుభూతిని  మృతుల కుటుంబ సభ్యులకు ప్రకటించారు. నెటిజన్లు తీవ్ర స్ధాయిలో  సునీత వ్యాఖ్యలపై  మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిందితులను హతమార్చిందని అందరూ ప్రశంసిస్తుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తప్పుపట్టడం తగదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: