కోవర్టు అంటే ఏంటి.. ఒక దగ్గర ఉంటూ.. మరోకొరి కోసం పని చేయడం.. ఇప్పుడు బీజేపీలోని ఇద్దరు నేతలు అలాగే పని చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ ఇద్దరు గతంలో టీడీపీ ఎంపీలే.. వారే సీఎం రమేశ్, సుజనా చౌదరి.. ఈ ఇద్దరు పేరుకే పార్టీ మారారని.. పార్టీ మారినా ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు ఫీలవుతుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

 

తాజాగా సీఎం రమేశ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలోకి మారిన రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ పోలవరం ప్రాజెక్టుకు సంబందించి మాట్లాడిన తీరు అలాగే ఉంది. ఇంతకూ సీఎం రమేష్ ఏమన్నరంటే..

పోలవరం ప్రాజెక్టు గత ఏప్రిల్ నాటికి అరవై శాతం నుంచి డబ్బై శాతం పూర్తి అయిందన్నారు. ఆ తర్వాత పనులు ఆగిపోయాయని ఆయన అన్నారు. అందుకు కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 

అంతే కాదు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఉన్నట్టుండి నిర్మాణ సంస్థను మార్చేశారు. అది సీవీసీ నిబంధనలను అనుసరించి తీసుకున్న చర్యేనా అని కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రశ్నిస్తున్నానని సీఎం రమేశ్ అన్నారు. నిర్మాణ సంస్థ బాగా పనిచేస్తుంటే ఎందుకు మార్చినట్టు ? బాగా పనిచేయకుండా నష్టం కలిగిస్తే... ఆ సంస్థ వల్ల కలిగిన నష్టం విలువ ఎంత? ఏ నష్టం జరగనప్పుడు నిర్మాణ సంస్థను ఎందుకు మార్చినట్టు? అని ఆయన ప్రశ్నించారు.

 

ఈ వాదనలన్నీ ప్రస్తుతం టీడీపీ చేస్తున్నవే.. బీజేపీ వాదన అందుకు విరుద్ధంగా ఉంది. కానీ సీఎం రమేశ్ నోట ఇంకా టీడీపీ వాదనే వస్తోంది. పోలవరంలో అవినీతి జరిగిందన్న అంశాల పై కాని .. టీడీపీకి ఇబ్బంది కలిగించే విషయాలు ఏమీ మాట్లాడలేదు సీఎం రమేశ్. సుజనా చౌదరి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. మరి ఇంతకీ వీరు టీడీపీలోనే ఉన్నారా.. బీజేపీలోకి వెళ్లారా.. ఒక పార్టీలో ఉండి మరో పార్టీ వాదన వినిపిస్తున్నారు.. ? ఏంటో ఏదీ సరిగ్గా అర్థంకావడం లేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: