కేంద్రంతో సత్సంబంధాల కోసం కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడో తేడా కొట్టినట్టుంది.. ఇటీవల జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దల దర్శనం కాలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రత్యేకించి ఎల్లో మీడియా రచ్చ రచ్చ చేసింది. జగన్ ను టార్గెట్ చేయాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ తమకు అనుకూలంగా కథనాలు ఇచ్చాయి.

 

ఈ నేపథ్యంలో కేంద్రం మనసు గెలుచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కావచ్చు. బహుశా.. పౌరసత్వ సవరణ బిల్లుకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని మతాలను సమానంగా చూడాలనేది వైయస్‌ఆర్‌ సీపీ అభిమతం అని చెప్పారు.

 

కులాలు, మతాలు, ప్రాంతాలు, చివరకు రాజకీయాలకు అతీతంగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, దురుద్దేశపూర్వకంగా వలసలను ప్రోత్సహించి జాతీయ భద్రతకు ముప్ప కలిగించడాన్ని అంగీకరించమన్నారు. మొత్తానికి వైసీపీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా సానుకూల సంకేతాలు పంపింది.

 

ఇదే సమయంలో టీడీపీ అంత అనుకూలంగా ప్రసంగించకపోవడం విశేషం. బిల్లుకు మద్దతు ఇస్తూనే.. కొన్ని సందేహాలు లేవనెత్తింది. వైసీపీ మాత్రం ఎలాంటి శషభిషలు లేకుండా ఈ బిల్లుకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని తేల్చి చెప్పేసింది. మరి ఈ మేరకు జగన్ పై కేంద్రం పెద్దల సానుకూల పవనాలు వీస్తాయా..చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: