దిశ హత్య కేసులోని నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఒక పక్క ప్రజలంతా విపరీతమైన హర్షం వ్యక్తం చేస్తుండగా మరొక వైపు మానవ హక్కుల కమీషన్ వారు మరియు ఎన్జీవోలు ఇది చట్టానికి విరుద్ధమైన చర్య అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఈ కేసు కాస్తా సుప్రీం కోర్టు ముందుకు వెళ్ళింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కోర్టువారు కూడా దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమ చట్టాలను మరియు రూల్స్ ను ఏ మాత్రం అగౌరవపరిచినా సహించని కోర్టువారు తక్షణమే తెలంగాణ పోలీసులపై చర్యలు చేపట్టారు.

 

తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి రమ్మని సుప్రీం కోర్టు వారిని కోరగా వారు దానిని తిరస్కరించి వెంటనే విశ్రాంతి జడ్జిని ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని ఆదేశించారు. అదీ కాకుండా అతను ఢిల్లీ నుండే ఈ కేసును సౌలభ్యం కూడా ఇచ్చారు. ఇంకా కచ్చితంగా మాట్లాడాలంటే పోలీసువారు నడుచుకునే విధానాలు తమకు తెలుసన్నట్లుగా మాట్లాడిన సుప్రీంకోర్టు దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లో తాము తేలికగా తీసుకోవడం లేదని చట్టాన్ని అతిక్రమిస్తే నిందితులకు ఎటువంటి శిక్షలు ఉంటాయో అటువంటి పోలీసులు వారికి కూడా వర్తిస్తాయి అని స్పష్టం చేసింది.


అయితే బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో పోలీసు వారు నిందితులను ఎన్ కౌంటర్ చేయడానికి చెప్పిన కారణాలు సరిగ్గా లేవని పలుచోట్ల వినిపిస్తున్నాయి. దీంతో రానున్న కొద్ది రోజుల్లోనే విచారణ ముగియనుండగా అందులో కచ్చితంగా వారు ఒక కట్టుకథ అళ్లారని... పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లుగా బయటపడడం ఖచ్చితం అంటున్నాయి నిఘా వర్గాలు. అదీ కాకుండా ఫోరెన్సిక్ నిపుణులు మరియు పోస్టుమార్టం రిపోర్టు కూడా పోలీసు వారు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం వారికి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. కాబట్టి పోలీసు వారు ఖచ్చితంగా ఈ విషయంలో సస్పెన్షన్ ఎదుర్కొంటారని... ఇంకా సుప్రీం కోర్టు వారు తలుచుకుంటే వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: