టైటిల్ వినడానికి కొంచెం ఘాటుగా ఉన్నా ప్రస్తుతం దిశ హత్య కేసులోని నిందితులను తెలంగాణ పోలీసు వారు ఎన్ కౌంటర్ చేసిన విధానం పై సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్న తీరు మాత్రం అచ్చం ఇలాగే ఉంది. మానవత్వం మరిచి ఒక అమాయకురాలైన ఆడపిల్లలపై తెగబడి అత్యాచారం జరిపి తరువాత ఆమె శరీరాన్ని బతికున్నప్పుడే కాల్చివేసిన నిందితులు నలుగురిని పోలీసు వారు ఎన్ కౌంటర్ లో చంపేసిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మకు శాంతి జరిగిందని అందరూ సంబరపడిన నేపథ్యంలో ఈ కేసు కాస్త అనుకోని మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.

 

ఒక్కసారిగా నిందితుల కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలని రోడ్ ఎక్కడం... అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ వారు కూడా ఎన్ కౌంటర్ పై తగిన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ కేసు వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే సుప్రీంకోర్టు వారు పోలీసులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను స్వీకరించి తెలంగాణ ప్రభుత్వం వారి తరపున న్యాయవాది తమ వాదనను వినిపించక ముందే దీనిపై విచారణకు ఆదేశించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఎన్నో ఘటనలలో పోలీసు వారు తమకు నచ్చినట్లు వివరించిన వైఖరిని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పరిగణించింది.

 

అలాగే తమ చట్టాలను మరియు నిబంధనలను అతిక్రమించిన వారిపై ఏమాత్రం జాలి చూపని కోర్టువారు తెలంగాణ పోలీసులు విషయంలో కూడా ఎప్పుడూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు ఒక విశ్రాంత జడ్జిని ఈ కేసు విచారణను కై హుటాహుటిన నియమించడం మరియు ప్రాథమిక విచారణలో పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ రిపోర్టులు కొంచెం అటూ ఇటుగా ఉండడం కూడా సుప్రీం కోర్టు వారిని ఆగ్రహానికి గురి చేసినట్లు ఉంది. ఏ విషయంలోనైనా నిష్పక్షపాతంగా వ్యవహరించే సుప్రీంకోర్టు ఇప్పుడు తెలంగాణ పోలీసుల భవితవ్యంపై కూడా సంచలన నిర్ణయం తీసుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: