మన భారతదేశం పసిడి ప్రియుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. బంగారం ధరలు తగ్గాయి అంటే చాలు.. ఆస్తులు అమ్మి ఆయిన సరే బంగారం కొనేయాలనుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే పసిడి ధరలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గుముఖం పట్టాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. 

 

గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు గత ఆరు రోజుల నుండి తగ్గుముఖం పట్టి పసిడి ప్రేమికులకు పండుగ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల తగ్గుదలతో 39,170 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల తగ్గుదలతో 36,910 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర అదే బాటలో నడిచింది. కేజీ వెండి ధర 90 రూపాయిలు తగ్గుదలతో 46,400 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,050 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,880 రూపాయల వద్ద కొనసాగుతుంది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది అని, ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు క్షీణించింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: