ప్రభుత్వం పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయటానికి ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభుత్వం ఏడు సార్లు చివరి తేదీని పొడిగించినప్పటికీ చాలామంది ఇప్పటికీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించుకోలేదు. ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 31వ తేదీ వరకు పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగించింది. కేంద్రం డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించుకోవాలని లేకపోతే పాన్ కార్డులు చెల్లవని చెబుతోంది. 
 
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు ఉపయోగించటానికి వీలు లేదని ప్రకటించనుంది. ఇప్పటికీ లక్షల సంఖ్యలో పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించుకోనివారు ఉన్నారని సమాచారం. ఫైనాన్స్ బిల్లులో సైతం డెడ్ లైన్ తరువాత ఆధార్ ను లింక్ చేయని పాన్ కార్డులు పని చేయనివిగా వెల్లడించాలని పేర్కొన్నారు. పాన్ కార్డును నాలుగు మార్గాల ద్వారా ఆధార్ తో లింక్ చేయవచ్చు. 
 
కొత్తగా పాన్ కార్డును తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేర్పులు చేసేవాళ్లు ధరఖాస్తుతోనే ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఎస్ఎంఎస్ ద్వారా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయవచ్చు. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్ ను టైప్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ ను టైప్ చేసి 567676 లేదా 56161 నంబర్లకు ఎస్ఎంఎస్ పంపి పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. 
 
ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసే సదుపాయం కల్పిస్తోంది. ఆన్ లైన్ లో కూడా ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయవచ్చు. incometaxindiaefiling.gov.in అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేసి linking aadhaar పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేస్తే పాన్ కార్డుతో ఆధార్ లింక్ అవుతుంది. ప్రభుత్వం చివరితేదీని పొడిగించే అవకాశం లేదని వార్తలు వస్తూ ఉండటంతో వీలైనంత త్వరగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయిస్తే మంచిది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: