అమెరికా వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో కొన్ని రకాల భయాలు, అపోహలు ఉన్నాయి.  ఆ భయాలు, అపోహలు పోగొట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.  ముఖ్యంగా అక్కడి ప్రజలు 13 నెంబర్ ను పెద్దగా ఇష్టపడరు.  13 నెంబర్ అంటే వాళ్ళు భయపడతారు.  ఎలాంటి పరిస్థితుల్లో కూడా 13 వాళ్లకు కలిసిరాలేదని, అందుకే ఆ నెంబర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటారు.  


గతంలో అమెరికా అపోలో 13 ఉపగ్రహం ప్రయోగించింది.  అది ఫెయిల్ కావడంతో ఈ సెంటిమెంట్ ను బలంగా నమ్మడం మొదలుపెట్టింది.  నమ్మకాలు, విశ్వాసాలు అనేవి కేవలం మన ఒక్కరికే కాదని, చాలా దేశాల ప్రజలకు కూడా ఉన్నాయని అర్ధం అవుతున్నది.  నమ్మకం, విశ్వాసమే పెట్టుబడి అని చెప్తుంటారు.  ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో కొన్ని రకాలకైనా నమ్మకాలు ఉన్నాయి.  


మనం 3, 13, 23 ఇలాంటి నెంబర్లను పెద్దగా నమ్మము.  అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలను సాధిస్తూ వస్తున్న ఇస్రోకు కూడా ఈ నమ్మకమే ఉన్నది.  ఇస్రో ఈ రంగంలో సాధించిన విజయం మామూలు విజయం కాదు.  ప్రతి ఒక్కరు గర్వపడేలా ఇస్రో ఈ రంగంలో అభివృద్ధి చెందింది.  ఇస్రో కూడా 13 వ నెంబర్ ను పెద్దగా నమ్మదు.  గతంలో 13 పేరుతొ చేసిన ప్రయోగం విఫలం కావడమే ఇందుకు ఉదాహరణ.  

 

ఇక ఇదిలా ఉంటె, ఇస్రో ప్రయోగం చేపట్టే ముందు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ.  మొన్నటి రోజున ఇస్రో చైర్మన్ తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చారు. ఆ తరువాత చేపట్టిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.  ఇది ఓ నమ్మకం.  ఈ నమ్మకాన్ని అలానే ఫాలో చేస్తున్నది ఇస్రో. టెక్నాలజీ పరంగా ఎంతటి అభివృద్ధి చెందినా.. చివరకు దేవుడిపై భారం వేయడం ఆనవాయితీగా వస్తున్నదే కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: