ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేతల ప్రసంగాల్లో చమక్కులు దొర్లుతున్నాయి. సీఎం జగన్ ను విరాట్ కోహ్లీతోనూ.. చంద్రబాబును కపిల్ దేవ్ తోనూ పోల్చారు వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్.. చంద్రబాబు డెబ్బైఏళ్ల వయసులో ఇరవై ఐదేళ్ల వ్యక్తిగా ఉంటానని అంటున్నారని ఎద్దేవా చేశారు.

 

కపిల్ దేవ్ వచ్చి ఇప్పుడు బాటింగ్ చేస్తానంటే ఒప్పుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కపిల్ దేవ్ ఇప్పుడు కామెంటరీ మాత్రమే చెప్పాలని అన్నారు. అలాగే తమ నేత జగన్ ఇప్పుడు విరాట్ కోహ్లి వంటి బాట్స్ మన్ అని ఆయన అన్నారు. అంతే కాదు.. ప్రజల పరీక్షలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పాస్ కాకపోతే అది ఎవరి తప్పో వారు ఆలోచించుకోవాలని గ్రామ సచివాలయాల గురించిన చర్చలో ఆయన మాట్లాడారు.

 

గ్రామ సచివాలయ ఉద్యోగాలను పకడ్బందిగా పరీక్షలు నిర్వహిస్తే తెలుగుదేశం అదినేత తప్పుడుప్రచారం చేస్తున్నారని గుడివాడ అమర్ నాథ్ అన్నారు. సచివాలయ ఉద్యోగాలు ఒకే కుటుంబంలోని వారు ముగ్గురో,నలుగురో ఎంపిక అయితే అది కూడా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు.ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సాయిప్రసాదరెడ్డి, వెంకటరమణారెడ్డి, బాలనాగిరెడ్డిలు ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్ లు ముఖ్యమంత్రులు అయిన చరిత్రలో ఎపిలో ఇదేనని ఆయన అన్నారు. లోకేష్ కుమారుడు పాస్ కాకపోతే దానికి ఎవరు ఏమి చేయాలని గుడివాడ అమర్ నాథ్ అన్నారు. రాజకీయ నాయకులను, క్రికెటర్లతో పోలుస్తూ చేసిన ప్రసంగం ఆసక్తి రేపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: