గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమిత్ షా హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన దూకుడు తొలి సంవత్సరంలోనే చూపించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 సమస్యను 70 సంవత్సరాల తర్వాత తీర్చారు. ఆ తరువాత అయోధ్య భూవివాదం సమస్య కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేశారు. రెండు అత్యంత క్లిష్టమైన, సున్నితమైన సమస్యలను ఎంతో చాకచక్యంగా పూర్తి చేశారు.

 

ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లులో కూడా ఇలాగే చాకచక్యంతో వ్యవరిస్తున్నారు బిజెపి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. బిజెపి లోక్ సభలో శివసేన పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. అక్కడ బిల్లు పాస్ అయింది. కానీ రాజ్యసభకు వచ్చే సరికి ఈ బిల్లుకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. శివసేన తన మద్దతును ఉపసంహరించుకుంది. కానీ చాలీ చాలని మెజారిటీతో ఈ బిల్లు రాజ్యసభలో కూడా నెగ్గింది.

 

కానీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు తమకు ఈ బిల్లు ఇష్టం లేదని స్పష్టం చేశారు. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్ కు లౌకికవాద దేశమనే పేరు ఉందని దాన్ని చెరిపేసేలా ఈ బిల్లు ఉందని అన్నారు. భారత మూలాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించిందని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని రావడం ఒక రకంగా ముస్లింలను వేరు చేసి చూసినట్టే అవుతుందని  చెప్పారు.

 

దేశాన్ని ముస్లింల రహితంగా మార్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించినట్లుగా అనిపిస్తోందని అయన తప్పుపెట్టారు.  దీనిపై సర్వత్రా ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జిఎస్టి లో వచ్చే వాటా కోసం టిఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించడం వల్ల కేంద్ర ప్రభుత్వం పై తమ అసమ్మతిని చెప్పినట్టు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: