2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సమస్యల గురించి ఆలోచించేవారు. అలాగే వారికి ఎప్పుడు నీరు అందేలాగా జలయజ్ఞం అని పథకం కూడా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు కోటి ఎకరాలకు నీరు అందించాలని దృఢసంకల్పంతో ఆయన ఉండేవారు. అప్పట్లో దానికనుగుణంగా ఎన్నో కాలువలు ,జలాశయాలు నిర్మించ దాల్చారు. చాలా రోజుల తర్వాత పోలవరం మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ను కూడా తెరపైకి తీసుకొని వచ్చారు.

 

 ఆయన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కొరత లేకుండా చూసుకొని వీలైనంత వరకు పనులు పూర్తి అయ్యేలా చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అవి అంతా చురుగ్గా సాగలేదని చెప్పాలి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పోలవరం మీద తన దృష్టిని పెట్టారు. మిగితా రాష్ట్రమంతా ఆయన దృష్టి సాధించలేదని ఒక విధంగా చెప్పాలి. మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.

 

 రాయలసీమ ప్రజలకి నీటి కరువు లేకుండా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కృష్ణా నదిలో వచ్చేవరద జలాలతో కేవలం యాభై రోజుల్లో రాయలసీమలోని అన్ని జలాశయాలు నిండేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. కేవలం నెల రోజుల్లో దీనికి సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

 

 చంద్రబాబునాయుడు హయాంలో నిధులు గనుక ఇచ్చి ఉంటే, ఈ రోజు గండికోట, చిత్రావతి, గోరుకల్లు, బ్రహ్మంసాగర్ జలాశయాలు పూర్తిగా నింపే వాళ్ళమని కానీ వారు వీటిని నిర్లక్ష్యం చేసినందుకు ఈ, సంవత్సరం వరద జలాలు పుష్కలంగా ఉన్న కూడా వాటిని పూర్తిగా వినియోగించు కోలేకపోతున్నామని చెప్పారు. అలాగే ప్రకాశం జిల్లాకి ఆయువుపట్టు  లాంటి వెలిగొండ రిజర్వాయర్ కూడా వచ్చే సంవత్సరం నీటితో నింపుతారు అని ఆయన ఈ సందర్భంగా సభాముఖంగా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: