దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో ప్రతి ఒక్కరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ అనుమానాలు నివృత్తి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్నింటిని పరిశీలించాలి.  కొన్ని విషయాలను తెలుసుకొని తీరాలి.  ఒకవేళ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే... మృతదేహాలు నీటుగా బెడ్ పై పడుకున్నట్టుగా అలా ఎందుకు ఉంటాయి అన్నది కొందరి వాదన.  


అంతేకాదు, వాళ్ళు నలుగురు పెద్దగా చదువుకోలేదు. తుపాకులు ఎలా వినియోగించాలి సినిమాల్లో చూసుంటారేమోగాని, రియల్ గా ఎలా ఉపయోగిస్తారో తెలియదు.  ఒకవేళ వాళ్ళు గన్స్ లాక్కున్నా ... ఎస్కార్ట్ గా 10 మంది పోలీసులు ఉన్నప్పుడు ప్రాణాలతో పెట్టుకోవచ్చు కదా అన్నది కొందరి వాదన.  జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాలమీదనే దృష్టి పెట్టి పలు విషయాలను పోలీసుల వద్ద నుంచి రాబట్టింది.  

 


అసలు అక్కడ నిజంగానే ఎన్ కౌంటర్ జరిగిందా లేదంటే, ఎక్కడైనా చంపేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా అనే కోణంలో కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపింది.  ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఎన్ కౌంటర్ తరువాత ఆ ప్రదేశాన్ని పరిశీలించి, పంచనామాలో పాల్గొన్న ఆర్డీవో, అలానే ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు.. విచారణ చేసింది జాతీయ మానవ హక్కుల కమీషన్.  


కాగా, వీటికి సంబంధించిన రిపోర్ట్ తీసుకొని కమీషన్ కు చెందిన ఏడుగురు సభ్యుల బృందం తిరిగి ఢిల్లీ వెళ్ళింది.  నవంబర్ 27 వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో దిశ ను నలుగురు నిందితులు ట్రాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.  దీంతో దేశం యావత్తు భగ్గుమన్నది.  దేశంలోని ప్రతి ఒక్కరు ఈ ఘటనపై మండిపడ్డారు.  దీనిని ముక్తకంఠంతో ఖండించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: