దేశంలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే ఆ ప్రభుత్వం పై ఆ ప్రభావం చూపిస్తుంది. రాష్ట్రంలో వచ్చే ఆదాయం తగ్గడం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పన్నుల వాటా రాకపోవడం వల్ల తెలంగాణలోని ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీనిలో భాగంగా ఖర్చులు తగ్గించి పొదుపు చేసే మార్గాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ కేటాయించిన నిధులు మించి ఒక్క రూపాయి కూడా వాడకూడదు అని సంబంధిత శాఖలకు చెప్పారు.

 

అలాగే ముఖ్యమైన పనులకు మాత్రమే ముందు నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన నిధుల వినియోగంపై అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు. నిధులు వినియోగంలో కచ్చితంగా నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.


 అలాగే మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్న వేళ సంపూర్ణ భద్రత కోసం కఠినమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే గోదావరి నదిపై దుమ్ముగూడెం లో నిర్మించదలచిన 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని వెంటనే నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి అయ్యే ఖర్చు రెండు సంవత్సరాలపాటు బడ్జెట్లో కేటాయించాలని స్పష్టం చేశారు.

 

దాదాపు 5 గంటలపాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలుపై నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో పురపాలక ఎన్నికల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నిర్వహించిన సర్వేలో తమకు పూర్తి అనుకూల ఫలితాలు ఉన్నాయని తెలిసింది. మంత్రులు ఆయా జిల్లాల వారీగా తమ బాధ్యతలు చేపట్టాలని సూచించారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: