దిశపై అత్యాచారం, హత్య తరువాత దేశంలో చట్టాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.  కేంద్రం మార్చే చట్టాలను కేంద్రం మార్పులు చేస్తుంటే... రాష్ట్రం కూడా చట్టాలను కఠినం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.  తెలంగాణలో జరిగిన ఈ సంఘటనతో ఏపీ ఉలిక్కి పడింది.  వెంటనే చట్టంలో మార్పులకు తెరతీసింది.  చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఎలాంటి నియమాలు పాటించాలి.  ఎలాంటి చట్టాలు చేయాలి అనే దానిపై నిన్నటి రోజున ఏపి క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.  


దీనికోసం ప్రత్యేకంగా దిశ యాక్ట్ పేరుతో ఓ చట్టం చేసింది.  మహిళలపై అత్యాచారం చేసిన వ్యక్తిని 21 రోజుల్లోనే విచారణ చేసి ఉరిశిక్ష పడేలా చేయాలనే దిశగా చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.  దీనిని కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో ఈ దిశగా అడుగులు వేయబోతున్నది.  అయితే, ఈ చట్టం ఎంతవరకు అమలు జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.  


ఎందుకంటే, దిశ యాక్ట్ ప్రకారం నిందితుడిని పట్టుకున్న వారం రోజులలోపుగా సాక్ష్యాధారాలు అన్నింటిని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి.  టెక్నికల్ గా పోలీసులు కేసును నిరూపించే విధంగా సాక్ష్యాలు ఉండాలి.  అంటే టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి.  అది ఎంతవరకు సాధ్యం అవుతుంది.  ఇలాంటి కేసుల్లో ప్రూవ్ కావడం చాలా కష్టమైన పని.  


కోర్టు కూడా ఇవే అడుగుతుంది.  అలా నిరూపించలేకుంటే కేసు వీగిపోతుంది.  ఏడాదో రెండేళ్లో శిక్ష పడుతుంది.  బయటకు వచ్చి మరలా అదే తప్పులు చేస్తుంటాడు.  అత్యాచారం కేసులను టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి అనే దానిపై మొదట చర్చించాలి.  ఆ తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి.  అప్పుడే ఇలాంటి కేసుల్లో నిందితుడికి శిక్ష పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న దిశ యాక్ట్ లోని అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుంటేనే గాని దీని గురించి ఏమీ  చెప్పలేము.  అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: