ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో విపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా సరే వాటి విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.  రాజకీయంగా బలపడటానికి గాని... చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల విషయంలో తన పార్టీ నేతలతో ఆయన ఎన్ని విధాలుగా ప్రచారం చేయించినా సరే ప్రజలు మాత్రం వాటి విషయంలో సంతోషంగానే ఉన్నారు అనేది వాస్తవం.

 

తను నాలుగేళ్ల సమయం తీసుకుని అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు... జగన్ ఆరు నెలలు కూడా సమయం తీసుకోకుండా అమలు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా సానుకూలత వ్యక్తమవుతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు సర్వేలకు దిగినట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ టీం లో ఉన్న కొందరితో సుజనా చౌదరి ద్వారా సంప్రదింపులు జరిపి వారితో కలిసి ఒక టీం ని ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లోకి పంపినట్టు తెలుస్తుంది.

 

వారి ద్వారా కీలక సమాచారాన్ని చంద్రబాబు సేకరించే పనిలో పడినట్టు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు... అందరికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా...? జగన్ పై సానుకూలత పెరుగుతుందా...? అప్పులు చేసి అమలు చేస్తున్నారు అనే ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారా...? తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు, జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలు ఏ తేడాలను గుర్తించారు.

 

వ‌లంటీర్ వ్యవస్థ మీద ప్రజల అభిప్రాయ౦ ఏంటి...? తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా...? వంటి వాటిని చంద్రబాబు సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక బాబు స‌ర్వే ఎలా ఉన్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లు అవుతున్నా సంద‌ర్భంగా బ‌య‌ట ప్ర‌జ‌ల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మాత్రం వ్య‌తిరేక‌త లేద‌న్న‌దే నిజం. ఒక‌టి ఆరా వ‌ర్గాల్లో ఇసుక కొర‌త వ‌ల్ల ఉన్న చిన్న చిన్న లోపాలు త‌ప్పా ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌తి ఒక్క‌రు సంతృప్తితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: