ఆర్టీసీ చార్జీలు పెరిగిన విషయమై నానా రచ్చ చేస్తున్న చంద్రబాబునాయుడు తెలంగాణా విషయాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించటం లేదు. ఏపిలో చార్జీలు పెంచటానికి ముందే తెలంగాణాలో కూడా ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు కేసియార్ స్వయంగా ప్రకటించారు. పెంచిన చార్జీలు అమల్లోకి కూడా వచ్చాయి. అయినా తెలంగాణాలో పెరిగిన ఆర్టీసీ చార్జీల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు ?

 

తెలంగాణాలో కూడా తెలుగుదేశంపార్టీ బలంగా ఉందని చంద్రబాబు తరచూ చెబుతుంటారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేస్తోందని చాలా సార్లు డప్పు కొట్టుకున్నారు. మరి ఆర్టీసీ సమ్మె విషయం కానీ, కేసియార్ వైఖరి విషయాన్ని కాని ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదే ?

 

తెలంగాణాలో సమ్మె చేసినపుడు కనీసం 30 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు మరణించారు. మరి వాళ్ళ మరణాల గురించి కూడా చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ మాట్లాడలేదు. తర్వాత చార్జీలు పెంచుతున్నట్లు కేసియార్ ప్రకటనను కూడా తమకు పట్టనట్లే ఉంటున్నారు.

 

అదే ఏపిలో ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే ఒకటే గోల చేసేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  అసెంబ్లీ, శాసనమండలిలో అవకాశం వచ్చినపుడల్లా నానా యాగీ చేస్తున్నారు. తెలంగాణాలో ఏమో  తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ఏపిలో మాత్రం ఎందుకు యాగీ చేస్తున్నట్లు ?

 

ఎందుకంటే తెలంగాణాలో పెరిగిన చార్జీలపై ఆందోళణలు చేయాలంటే చంద్రబాబు వణికిపోతున్నారు. కేసియార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకు స్పష్టంగా ఎప్పుడో అర్ధమైపోయింది. ఓటుకునోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా తగులుకున్న దగ్గర నుండి కేసియా కలలో కనిపించినా వణికిపోతున్నారు.

 

అందుకనే  టిడిపి జాతీయపార్టీనే అయినా కేవలం ఏపికి మాత్రమే పరిమితమైపోయింది. పైగా తానుంటున్నది, తన వ్యాపారాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. కేసియార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఏమవుతుందో చంద్రబాబుకు అర్ధమైంది. అందుకనే తెలంగాణాలో ఏమి జరిగినా నోరెత్తటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: