కేటీఆర్‌...ఇప్పుడు ఈ పేరు రాజ‌కీయ అధికార వ‌ర్గాల్లో సుప‌రిచితం. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపుల‌ర్‌. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌, ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు కొడుకు. స‌హ‌జంగానే ఆయ‌న‌కు ఉండే ప్రాధాన్యం ఆయ‌న‌కు ఉంటుంది. అయితే, ఈ పాపులారిటీతో ఆయ‌న‌కు మేలు ఏం జ‌రిగింది? ఎంత జ‌రిగింది అనే విష‌యం అలా ప‌క్కన ఉంచితే...ఊహించ‌ని స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయంగా, అధికారికంగా కేటీఆర్‌ను ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డేసే వారు ఎక్కువ‌గా త‌యారు అవుతున్నారు. అలా ఓ వ్య‌క్తి కేటీఆర్ కేంద్రంగా త‌న ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూశాడు. అయితే, దొంగ‌త‌నం ఎక్కువ రోజులు ఆగ‌దు క‌ద‌. అడ్డంగా దొరికిపోయాడు. 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...ఇంకేం ఆశ‌లుంటాయిలే!

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పీఏల మంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ పేరు చెప్పి విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పడుతున్న కార్తికేయ, ఫెడ్రిక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రూ మామూలు వాళ్లేం కాదండి కార్తికేయ చార్టెడ్ అకౌంటెంట్ కాగా ఫెడ్రిక్ మెకానికల్ ఇంజినీర్‌.మల్కాజిగిరి, లాలాపేట్ ప్రాంతానికి చెందిన కార్తీకేయ, ఫెడ్రిక్ స్నేహితులు. వీరిద్దరూ తరచూ సచివాలయానికి వెళ్తూ.. పలువురు అధికారులతో పరిచయాలు చేసుకున్నారు. ఇటీవల కార్తికేయ తాను మంత్రి కేటీఆర్ పీఏ శ్రీనివాస్‌నని చెప్పుకుంటూ.. మారేడ్‌పల్లిలోని కస్తుర్బా కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీరాములురాజుకు ఫోన్‌చేశాడు. తన స్నేహితుడు కార్తికేయ వస్తాడని, కాలేజీలో ఒక సీటు ఇవ్వాలని కోరాడు. ఇలా సీటు ఇప్పించినందుకు కార్తీకేయ లబ్ధిదారుల నుంచి రూ.90 వేలు వసూలుచేసుకున్నాడు. ఇంకేం ఇలా హ్యాపీగా డ‌బ్బులు వ‌స్తుండ‌టంతో...దందా జోరు పెంచారు.

 

వాచ్‌మెన్‌పై పెట్రోల్ దాడి...అండ‌గా నిలిచింది తెలంగాణ మంత్రి...డీల్ ఏంటో తెలుసా?
అయితే, స‌ద‌రు సంస్థ అధికారి శ్రీరాములు రాజుకు ఓ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. తన కుమారుడి వైద్య చికిత్స కోసం ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి పీఏ శ్రీనివాస్‌నంటూ ఫోన్‌లో పరిచయం చేసుకున్న కార్త్తికేయను కోరారు. దీంతో కార్తికేయ, ఫ్రెడ్రిక్‌లు ఇంటర్నెట్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రి పేరు మీద ఉన్న పత్రాలను డౌన్‌లోడ్ చేసి, వాటిని ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) కింద మార్చి, శ్రీరాములురాజుకు అందజేశారు. ఈ ఎల్వోసీతో ఆయన శ్రీకర దవాఖానలో కుమారుడికి వైద్యం చేయించుకున్నారు. ఆ తర్వాత ఎల్వోసీని పరిశీలించిన వైద్యులు అది నకిలీదని గుర్తించారు. దీంతో శ్రీరాములురాజు కార్తీకేయకు ఫోన్‌చేయగా అది స్విచ్చాఫ్ వ‌చ్చింది. ఈ వ్యవహరంపై ఆయన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో పోలీసులు దర్యాప్తుచేపట్టారు. విచారణలో భాగంగా నిందితుల ఫోన్ నంబర్లను పరిశీలించగా.. వందలమంది ప్రభుత్వ అధికారులకు ఫోన్లుచేసి, పనులు చేయించుకున్నారని తేలింది. దాంతో పోలీసులు త‌మ‌దైన శైలిలో వివ‌రాలు ఆరాతీసి...నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

 


మల్కాజిగిరి డీసీపీ రక్షత కే మూర్తి తాజాగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ..మంత్రుల పీఏలమంటూ పనులు చేసి పెడతామని చెప్పి డబ్బులు వసూలుచేసే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా పరిచయం చేసుకునేవారి వివరాలను ఆరా తీయాలని, అనుమానంవస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా, అరెస్టైన ఈ  ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు రూ.1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: