దిశ అత్యాచార , హత్య ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా, సామాన్యుని నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు అందరూ  ఆమె కుటుంబానికి మద్దతుగా నిలిచారు . అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతున్న టీఆరెస్ నేతలు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది . దిశ అత్యాచార , హత్య ఘటన అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా , ఇప్పుడు కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభ మరొక అడుగు ముందుకేసి , దిశ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదేమోనంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి .

 

తన చెల్లికి ఫోన్ చేసే బదులు 100 నెంబర్ డయల్ చేసి ఉంటే పోలీసులు వచ్చి దిశ ను కాపాడేవారన్న మహమూద్ అలీ , చదువుకున్న మూర్ఖురాలి మాదిరిగా దిశ వ్యవహరించిందన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి . మహమూద్ అలీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి . జాతీయ మీడియా చానెళ్లు సైతం మహమూద్ అలీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా,  హోం మంత్రి ఎలా ఇంతటి  బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేస్తారంటూ ప్రశ్నించాయి . ఇక ఇంటికొక పోలీసు కానిస్టేబుల్ ను పెట్టలేము కదా అంటూ మరొక మంత్రి తలసాని చేసిన కామెంట్స్ పై  సోషల్ మీడియా లో నెటిజన్స్ నిప్పులు చెరిగారు .

 

దిశ అత్యాచార , హత్య ఘటనపై ఇప్పుడు శోభ చేసిన బాధ్యతరహితమైన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది హాట్ టాఫిక్ మారింది .    కన్న కూతురు ను కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న కుటుంబం పై సానుభూతి ప్రదర్శించాల్సింది పోయి , ఆ కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టీఆరెస్ నేతలు  తమ ప్రభుత్వ పనితీరును సమర్ధించుకోవాలని చూడడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: