దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన దిశ హత్యాచారం కేసును హైదరాబాద్ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. అలాగే అంత నీచమైన నేరం చేసిన నిందితులకు దిశ ఉసురు తగిలి కేవలం 10 రోజుల్లోనే ఘోరంగా చచ్చిపోయారు. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులని సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి పోలీసులు తీసుకెళ్తే... పోలీసులపై తీవ్ర దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు ఈ కరుడుగట్టిన నేరస్తులు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఆ క్రమంలో వాళ్లు చనిపోయారు.. దాంతో ప్రజలు సంతోష పడ్డారు.

కానీ మానవ హక్కుల సంఘం వారు ఢిల్లీ నుంచి ఎగేసుకొని వచ్చి.. మంచి పని చేసిన పోలీసులను పనికిమాలిన ప్రశ్నల వర్షంతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇకపోతే.. కొంతమంది ప్రజలు మాత్రం ఆ నలుగురు నిందితులు అమాయకులని, దిశను మరెవరో అత్యాచారం చేసి హత్య చేసారని ఆరోపణలు చేస్తున్నారు. తమాషా ఏంటంటే... ఈ ప్రజలే ఎన్కౌంటర్ జరగక ముందు రోజు వరకు.. పోలీసులు ఆధారాలను సేకరిస్తుంటే.. ఈ పోలీసుల వాళ్ళ ఏం కాదు.. చంపింది వాళ్లేనని ఒప్పుకున్న తర్వాత కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నారని పోలీసులను ఎగతాళి చేసారు. చివరికి.. పోలీసులు సరైన పద్దతిలో దిశకు న్యాయం చేసినప్పటికీ తిప్పలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద వంతెన కింద కాలిన మృతదేహం దిశదేనని డీఎన్‌ఏ విశ్లేషణలో తేలింది. దిశ మృతదేహం నుంచి సేకరించిన ఎముక కాండాన్ని ఆధారంగా చేసుకొని ఫోరెన్సిక్ నిపుణులు ఈ డిఎన్ఏ పరీక్షలు చేసి దీన్ని నిర్దారించారు. ఆపై ఈ సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులకు అందచేశారు. అయితే ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ కావడంతో... దిశ కేసులో బలమైన సాక్ష్యంగా మారింది. ప్రస్తుతం ఎన్కౌంటర్ లో హతమైన నలుగురు నిందితులు దిశ పై అత్యాచారం చేశారనే సైంటిఫిక్ ఎవిడెన్స్ సంపాదించడానికి కొన్ని కీలకమైన ఆధారాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. ఆ కీలకమైన ఆధారాలలో దిశ లోదుస్తులపై ఉన్న వీర్యకణాలు, ఘటనా స్థలంలో దొరికిన వెంట్రుకలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నిందితుల రక్త సంబంధీకుల నుంచి సేకరించిన డిఎన్ఎ ప్రొఫైల్ తో.. పోలీసులు పొందుపరచిన కీలకమైన ఆధారాలతో సరి పోల్చే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు నిమగ్నమయ్యారు. అయితే ఈ డిఎన్ఏ విశ్లేషణలో.. నిందితులే అత్యాచారం చేశారని నిరూపితమైతే.. ఇది ఒక బలమైన సాక్ష్యం గా మారనుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ నివేదిక ల్యాబ్ నుంచి పోలీసులకే అందే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: