దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని పపువా న్యుగినియాకు చెందిన బుగెన్‌విల్‌ అనే చిన్న దీవి త్వరలోనే స్వతంత్ర దేశంగా  ఆవిర్భవించనుంది. ఈ మేరకు జరిగిన రెఫరెండంలో స్వతంత్ర దేశానికే మొగ్గు చూపారు. ఇక ఇప్పుడు ప్రపంచ పటంలో నూతన దేశంగా చిన్న దీవి ఆవిర్భవించనుంది.

 

 

ఇకపోతే ఈ ద్వీపంలో మూడు లక్షలమంది ప్రజలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది మెలనేసియా తెగకు చెందినవారు. వీరి స్థానిక భాష టొక్‌పిసిన్‌. బుకా పట్టణం ఈ కొత్త దేశ రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాయాలు అక్కడే నెలకొంటాయని అధికారులు ప్రకటించారు. తమకు స్వాతంత్రం కావాలన్న డిమాండ్‌తో బుగెన్‌విల్‌ ప్రజలు పపువా న్యుగినియా సైన్యంతో చేసిన పోరులో 20 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ దీవిలో రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. విస్తారమైన ఖనిజ సంపద ఈ దేశానికి ఉంది.

 

 

అందులో రాగి ప్రధానమైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రాగిలో బౌగెన్‌విల్లేది 7 శాతం కావడం గమనార్హం. దీంతో వీటి వెలికితీతకు అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కొత్తదేశం అవతరించనుండటంతో ఆదాయమార్గాలపై దేశ నాయకులు అన్వేషిస్తున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందిస్తే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బుగెన్‌విల్‌ నేతలు భావిస్తున్నారు.

 

 

ఇక్కడ ఉన్న బౌగెన్‌విల్లే దేశంలో బుకాతోపాటు అరావా, బూయిన్ మాత్రమే చెప్పుకోదగ్గ నగరాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 2.49,358. ఈ ఎనిమిదేళ్ల కాలంలో 3 లక్షల వరకు చేరి ఉంటుందని ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రిఫరెండం ఆఫీసర్ మోరిసినో క్లాడియో ప్రకటించారు. ఈ దేశంలో నివసిస్తున్న జనాభాలో మలేషియా నుంచి వచ్చినవారే ఎక్కువ ఉండటం విశేషం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: