ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలనం. ఎప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకు ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. 

            

బుధవారం నిన్న జరిగిన కేబినెట్ భేటీలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్లుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆర్టీసీలో ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవల కొనసాగింపునకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

              

1997లో అప్పటి ప్రభుత్వం జీవో నం.14ను తీసుకురాగా దీని ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీల్లేదని అధికారులు చెప్పారట. అయితే సీఎం జగన్ జీవో నం.14ను రద్దు చేయాలని ఆదేశించారు. అయితే అలా రద్దు చెయ్యడం వల్ల మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల్ని విలీనం చేయాలనీ భారీగా ఒత్తిడి వస్తుందని అధికారులు వివరించడంతో జీవో 14ను రద్దు చేసి కేవలం ఆర్టీసీని మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

దీంతో ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఈ ఒక్క నిర్ణయమే కాదు ఈ ఆరు నెలలలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పేద ప్రజల కోసం అయన తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలు గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజా శేఖర్ రెడ్డి సైతం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: