మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ కేంద్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన హ‌నీ ట్రాప్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు క‌ర్నాక‌ట‌లోనూ ఇదే త‌ర‌హాలో మ‌రో హానీ ట్రాప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్క‌డ కూడా ఓ ముఠా ఎమ్మెల్యేలు, పారిశ్రామిక వేత్త‌ల‌ను టార్గెట్ గా చేసుకుని వాళ్ల‌కు అంద‌మైన అమ్మాయిల‌ను ఎర‌వేసి, ట్రాప్‌లో ప‌డేలా చేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డ‌బ్బులు వ‌సూలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ క్ర‌మంలోనే ఓ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో హనీట్రాప్‌ కేసులో సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హనీట్రాప్‌ లో ఇద్దరు అనర్హ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ముఠాలో చిక్కుకున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపద్యంలో సీసీబీ పోలీసులు రఘు అలియాస్‌ రాఘవేంద్ర తో పాటు నలుగురు హనీట్రాప్‌ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసును విచారిస్తోన్న పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

అయితే ఈ కేసులో భాగ‌స్వామ్యం ఉన్న మరికొంద‌రు నిందితులు సైతం ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే హనీట్రాప్‌ ముఠాలో చిక్కిన వీడియో వైరల్‌ అయింది. ఈ కేసులో రఘు అరెస్టైన అనంతరం అతడి ఇంట్లో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల హనీట్రాప్‌ వీడియో గురించి నిజానిజాలు రాబట్టడానికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఈ వీడియోను సీసీబీ పోలీసులకు అందించింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అందించిన నివేదిక అనంతరం మరిన్ని వీడియోలు బయటికి వచ్చాయి.

 

ఇక పోలీసులు ఈ కేసు విచార‌ణ‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేలు నిజంగానే హానీ ట్రాప్‌లో చిక్కుకున్నారా ?  లేదా ఈ ముఠా ఏవైనా న‌కిలీ వీడియోలు క్రియేట్ చేసి ఎమ్మెల్యేలను బెదిరించి డబ్బు తీసుకున్నారా ? అనే దాని గురించి సీసీబీ విచారించాల్సి ఉంది. హనీట్రాప్‌ గురించి ఎమ్మెల్యేల వద్ద సమాచారం రాబట్టడానికి సీసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: