హైదరాబాదులోని శంషాబాద్ ప్రాంతం వద్ద వెటర్నరీ డాక్టర్ దిశ ను అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన నిందితులను తెలంగాణ పోలీస్ వారు ఎన్ కౌంటర్ చేసిన తీరును ప్రశంసిస్తూ దేశం యావత్తూ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే వారు నిందితులని కాల్చి చంపేసిన విధానం ఏ మాత్రం తమకు నచ్చలేదని కుటుంబ సభ్యులు మరియు మానవ హక్కుల కమిషన్ వారు గగ్గోలు పెట్టి ఈ విషయాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకుని వెళ్లారు. ఈ మధ్య అనేక కేసుల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసును కూడా ఏమాత్రం తేలిగ్గా పరిగణించడం లేదు. 


అయితే ఎన్ కౌంటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పాత్ర ఎంత అనే విషయంపై విచారణ జరపగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయని సమాచారం. సరిగ్గా దిశ ఘటన జరిగినప్పుడు ఆర్టీసీ వ్యవహారంలో బిజీగా ఉన్న కెసిఆర్ పైన ప్రజల నుంచి ఒత్తిడి భారీగా వచ్చింది. దీంతో కెసిఆర్ వెంటనే పోలీసులతో నిందితులను కోర్టు ముందు వీలైనంత త్వరగా కాకుండా వెంటనే హాజరు పరచవలసిందిగా ఆదేశించినప్పుడు పోలీసులు అర్ధరాత్రి పూట వారిని ఘటనా స్థలం వద్దకు సీన్ రీ కన్స్ట్రక్షన్ కొరకు తీసుకుని వెళ్లడం... అక్కడ ఈ ఎన్ కౌంటర్ జరగడం అంతా అనేక అనుమానాలకు తావిస్తోంది. 

 

ఇప్పుడు కొత్తగా బయట పడిన ఇది అని అందరూ చెబుతున్న విషయం ఏమిటంటే కెసిఆర్ నిందితులకు శిక్ష విధించేందుకు సరైన ఆధారాలు లేని కారణంగానే హత్యకేసులో నిందితులను కావాలనే పోలీసులు తో తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇలా చేయించాడు అని. అంతేకాకుండా అనుకోని పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ విషయమై జగన్ మరియు చాలామంది కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కూడా ఇక్కడ అందరినీ అనుమానానికి గురి చేస్తోంది. అసలు పోలీసులు అనుకోకుండా చేసిన పనిని కేసీఆర్ ప్లాన్ చేసి చేయించినట్లుగా వీరు అతనిని అభినందించడం ఏమిటని ఇక్కడ ప్రశ్న.

 

కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే కానీ ఒక్క ఇటుక పేర్చుకుంటూ పోతేనేగా ఇల్లు పూర్తి అవుతుంది కాబట్టి ఈ తరహాలో కేసుని విచారణ జరిపి ముందుకు తీసుకొని వెళ్ళనున్నారని సమాచారం. అదే నిజమైతే కేసిఆర్ కు త్వరలోనే కోర్టు నుండి కబురొస్తుంది. ఇంకా ఈ కేసు లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో...? 

మరింత సమాచారం తెలుసుకోండి: