రాజధాని భూములకు సంబంధించి  తెలుగుదేశంపార్టీలోని కొందరు నేతలపై జగన్మోహన్ రెడ్డిపై దారుణంగా దెబ్బకొట్టారు. టిడిపి హయాంలో కొందరు నేతలు దళితుల నుండి అసైన్డ్ భూములు కొన్నారు. నిజానికి దళితులకు కేటాయించిన భూములను కొనడటం చట్ట ప్రకారం నేరం. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని కొనేశారు. తర్వాత రాజధాని కోసం జరిగిన భూసేకరణలో తాము కొన్న భూములను ఇచ్చేసి ప్రభుత్వం నుండి విలువైన ప్లాట్లు తీసేసుకున్నారు. ప్రస్తుతం అటువంటి ప్లాట్ల కేటాయింపులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.

 

చంద్రబాబునాయుడు హయాంలో రాజధాని ప్రాంతంలో దళితుల భూములను కొనటం, తర్వాత భూసేకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేయటంలో కొందరు టిడిపి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రైతుల నుండి భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. తర్వాత రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత తమ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్లే ఇచ్చి విలువైన కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లను తీసేసుకున్నారు.

 

అంటే రైతులకు ఇచ్చిన ధరకన్నా ప్రభుత్వం నుండి ప్లాట్ల రూపంలో తీసుకున్న విలువ చాలా ఎక్కువ. ఈ విషయంలోనే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ఎన్నో ఆరోపణలు చేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే మోసపోయామని గ్రహించిన రైతులు ఆందోళన చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

 

సరే మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ విషయంపై దృష్టి సారించారు. జరిగిన మోసాన్ని రైతుల నుండి ఫిర్యాదుల రూపంలో తీసుకుని ఇపుడు అటువంటి ప్లాట్ల కేటాయింపులన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో టిడిపిలోని ముఖ్య నేతలు చాలామంది దారుణంగా నష్టపోయినట్లే. సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, పయ్యావుల కేశవ్, దూళిపాళ నరేంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి నేతలు చాలామంది ఇక్కడ అసైన్డ్ భూములు కొన్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.

 

ఎందుకంటే కీలక నేతలు అవకాశం ఉన్నంతలో తమ బినామీల ద్వారా దళితుల భూములను కొనుగోలు చేయించారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల భూములు కొనుగోలు చేసినపుడు అప్పట్లో రైతులకు డబ్బులు ముట్టాయి. చట్టవిరుద్ధంగా భూములు కొనుగోలు చేసి ప్రభుత్వం నుండి తర్వాత ప్లాట్లు తీసుకున్నందుకు ఇపుడు అవి రద్దవుతున్నాయి. అంటే భూములు కొనుగోలు చేసిన టిడిపి నేతలు రెండు రకాలుగా నష్టపోయారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: