ఒకవైపు పెరిగిపోతున్న ఉల్లిపాయల ధరలు జనాలను  ఇబ్బందులు పెడుతుంటే తాజాగా కోడిగుడ్ల ధరలు కూడా భయపెడుతున్నాయి.  పెరిగిపోయిన ఉల్లిపాయల ధరలు దేశవ్యాప్తంగా జనాలను ఎంతగా ఇబ్బందులు పెడుతున్నాయో అందరికీ అనుభవంలోకి వస్తోంది.  ఉల్లిధరలు ఇలా పెరిగిపోతుండగానే కోడిగుడ్ల ధరలు పెరిగిపోతుండటం జనాలను బాగా ఇబ్బందులు  పెడుతున్నాయి.

 

ప్రస్తుతం కొన్నిచోట్ల 5 రూపాయలు మరికొన్ని చోట్ల 6 రూపాయలుగా ఉన్న కోడిగుడ్డు ధర కొన్నిచోట్ల 10 రూపాయలకు పెరిగిందని సమాచారం.  నిజానికి ఎవరు కోడిగుడ్లను వాడినా అందులో ఉల్లిపాయలు వేయక తప్పదు. ఇప్పటికే పెరిగిపోయిన ధరలతో చాలా చోట్ల ఉల్లిపాయల వాడకాన్ని బాగా తగ్గించేశారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జనాలు అసలు ఉల్లిపాయల జోలికే వెళ్ళటం కొద్ది రోజులుగా మానేశారు.

 

ఉల్లిపాయల ధరలకు అదనంగా కోడిగుడ్ల ధరలు కూడా పెరగటంతో రెగ్యులర్ గా వాడుకునే వాళ్ళు ఇపుడు కోడిగుడ్లను కూడా కొనే పరిస్ధితి కనబడటం లేదు. కోళ్ళ ఫారాలు నడపటంలో నష్టాలు రావటం, కోళ్ళ దాణాల ధరలు పెరిగిపోవటం లాంటి పరిస్ధితుల వల్ల చాలామంది కోళ్ళ ఫారాలను మూసేశారు. ఎప్పుడైతే కోళ్ళ ఫారాలు మూసేశారో దాని ప్రభావం మిగిలిన కోళ్ళ ఫారాల వల్ల పడింది.

 

కోళ్ళఫారాల మూసివేత వల్ల కొన్నిచోట్ల కోడిగుడ్ల ధరలు 6 రూపాయలకు  పెరిగిపోయింది. దాంతో  చాలా అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంగా ఇస్తున్న కోడిగుడ్ల వాడకాన్ని మానేశారు. కోడిగుడ్డు ధర 6 రూపాయలకు పెరిగినందుకే అంగన్ వాడి కేంద్రాల్లో వాడకాన్ని మానేస్తే 10 రూపాయలకు పెరిగితే అసలు కోడిగుడ్లనే మరచిపోవటం ఖాయం.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లోను రోజుకు సుమారు 8300 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. కోడిగుడ్ల రేట్లు పెరగటంతో కోళ్ళ ఫారాల యజమానులు ఎక్కడైనా లాభపడినా మొత్తం వినియోగదారులకు మాత్రం చుక్కలు కనబడటం ఖాయమనే చెప్పాలి. ఇపుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉల్లిలొల్లి ఏమిటో అందరూ చూస్తున్నారు. దీనికి అదనంగా కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిపోతే అంతే సంగతులు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: