వైకాపాకు పూర్తి యాంటిగా జనసేన పనిచేస్తున్న సంగతి తెలిసిందే.  జగన్ తీసుకునే నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తున్నారు.  ముఖ్యంగా రైతుల విషయంలో, ఇంగ్లీష్ మీడియం బోధన, ఇతర విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ ను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  అయితే, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది.  


ఇందులో భాగంగానే ప్రభుత్వం కొన్ని చట్టాలను మార్చాలని అనుకుంది.   మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా.. అత్యాచారాలు జరిగితే... నాలుగు నెలకు కాకుండా కేవలం 21 రోజుల్లోనే కేసు పూర్తికావాలని, దానికి అనుగుణంగా చట్టాలు మార్చాలని నిర్ణయం తీసుకుంది.  రేప్ చేశాడని తేలితే... వారికి మరణశిక్ష విధించే విధంగా కూడా చట్టాలను మారుస్తుంది.  


ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  సెలెబ్రిటీలు సైతం జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ చట్టాన్ని స్వాగతించారు.  జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  సిఆర్.పీ.సి చట్టాలు మార్చి తక్కువ సమయంలోనే కేసు పూర్తయ్యేలా చూడటంతో పాటుగా ఐపీసీలో కూడా సమూలంగా మార్పులు చేసి శిక్షలు పడేలా చేయడానికి సిద్ధం అవుతున్న ఏపీ సర్కార్ కు అభినందనలు తెలిపారు.  


చట్టాలను మార్చి, కఠినం చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని, అత్యాచారం చేస్తే మరణశిక్ష పడుతుందనే భయం ఉంటె ఎవరూ కూడా ఆ దిశగా ఆలోచనలు చేయరని, మహిళలను వేధించినా ఇలాంటి చట్టాలే అమలు చేయబోతున్నారు కాబట్టి మహిళలు నిరభ్యంతరంగా తిరగగలుగుతారని, ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం ఉండదని మెగాస్టార్ పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవి వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించడంతో పవన్ షాక్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: