కాకినాడలో పవన్ కళ్యాణ్ రైతులను ఉద్దేశించి రైతు సౌభాగ్య దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ దీక్ష కోసం వేలాది మంది అభిమానులు, రైతులు, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు.  ఈ ఉదయం 8 గంటల నుంచి దీక్ష మొదలైంది.  దీక్షలో పవన్ తో పాటుగా నాగబాబు తదితరులు కూడా కూర్చున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుంది.  ఈ దీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  


రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు.  పైగా రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు డబ్బులు  చెల్లించలేదని కూడా రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.  వీటిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షకు శ్రీకారం చుట్టారు. 


అయితే, పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు అర్ధం లేదని, రైతులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు లేవని, ప్రభుత్వం అన్ని సమస్యలను తీరుస్తుందని ఇప్పటికే మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.  లేని సమస్యకు పరిస్కారం చూపాలి అంటే ఎలా అని అయన ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  కానీ, పవన్ మాత్రం, సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని పట్టుబడుతూ దీక్షకు కూర్చున్నారు.  


ఒకవైపు పవన్ దీక్ష చేస్తుంటే.. మరోవైపు ఏపీలో అసెంబ్లీసమావేశాలు జరుగుతున్నాయి.  ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జరుగుతున్న సమావేశాల్లో పవన్ దీక్ష గురించి మాట్లాడతారా చూద్దాం.  అటు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక దీక్షకు హాజరు కాలేదు.  అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పి అయన శాసనసభకు హాజరయ్యారు.   ఈ దీక్ష విషయంలో రాపాక పవన్ తో విభేదించారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: