ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నాలుగవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో తన గళాన్ని ఎత్తారు. ఆమె మాట్లాడుతూ... సభా సాంప్రదాయాలు, సభ్యుల మనోభావాల గురించి ఈరోజు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సూపర్ కౌంటర్ ఇచ్చారు. దానికి గల కారణాలను కూడా పుష్ప శ్రీవాణి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలకు జరిగిన అవమానాలను గురించి పుష్ప శ్రీవాణి గుర్తుచేశారు.



చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు ప్రస్తుతం వైసీపీ నేతలు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారని చెప్పుకొచ్చారు. అలాగే అచ్చెన్నాయుడు అన్నటువంటి మాటలు చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి లో ఉన్నానని, దానికి తన సంస్కారం అడ్డొస్తోందని పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అన్నటువంటి మాటలు మహిళలంతా తల తలదించుకునే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.


అదేవిధంగా గత ప్రభుత్వంలో రోజా కి ఎదురైన ఎన్నో అవమానాలను కూడా ఈ సభలో గుర్తు చేశారు పుష్ప శ్రీవాణి. ఆమె మాట్లాడుతూ...మహిళా శాసన సభ్యురాలు అయినటువంటి శ్రీమతి ఆర్ కె రోజా సెల్వమణిని అన్యాయంగా సస్పెండ్ చేసారని చెప్పారు.. రోజా కోర్టు ఆర్డర్ తోటి అసెంబ్లీ లోకి అడుగు పెట్టిన సందర్భంలో... ఆమెను లోపలికి కూడా రానివ్వకుండా బయట కూర్చోపెట్టి ఎంతగానో టీడీపీ నేతలు అవమానించారని తెలిపారు. అదేవిధంగా.. ఆరోజు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి తో సహా అందరం శాసనసభ్యులు కూడా బయట కూర్చునే పరిస్థితి వచ్చిందని ఆమె బాధగా వ్యాఖ్యానించారు. మీడియాని కూడా కనీసం లో రానివ్వకుండా నియంత్రించారు ఈ టీడీపీ పెద్దలు అని చివాట్లు పెట్టారు.


నిండు సభలో నానిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్షల్ తో బయటకు మోసుకు వెళ్లారు ఈ టీడీపీ నేతలని... ఆ రోజు ఎంత అవమానంగా సభ్యులు ఫీల్ అయ్యారో ఊహించు కోవచ్చు అని ఆమె అన్నారు. వాళ్లు గతంలో చేసినవి ఒక్కసారి ఆలోచించుకుంటే... ఎంత దౌర్భాగ్యంగా వాళ్లు వ్యవహరించారో వారికే అర్థమవుతుందని అన్నారు. ఇంకా మాట్లాడుతూ... గతంలో పెద్దల గురించి, ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వీరు... సభా సాంప్రదాయాల గురించి ఇప్పుడు మాట్లాడే అర్హత అస్సలు లేదని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టీడీపీ నేతలను ఏకిపారేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: