హైదరాబాద్ కి చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులోని నిందితులను తెలంగాణ పోలీసులు అత్యంత నాటకీయమైన రీతిలో ఎన్ కౌంటర్ చేసి చంపిన విషయం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఎన్నో మలుపులు తీసుకున్న ఈ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో దీని తీవ్రత కాస్తా తారాస్థాయికి చేరింది. పోలీసులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వారు స్వీకరించడం మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది యొక్క వాదన వినడానికి తిరస్కరించి వెంటనే ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని విచారణ కోసం నియమించడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

అయితే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఈ కేసులో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. నిన్న అసెంబ్లీలో మంత్రి తలసాని మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయించినందుకుగాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కు హ్యాట్సాఫ్ తెలిపిన విధానం ఇప్పుడు వారిని చిక్కుల్లో పడేసింది. అసలు పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్ కొరకు ఘటనా స్థలం దగ్గరికి తీసుకొని వెళితే వారు అనూహ్యంగా పోలీసులపై దాడికి పాల్పడినప్పుడు ఆత్మ రక్షణ కోసం వారిని ఎన్ కౌంటర్ చేసి చంపాల్సి వచ్చింది అని. 

 

అయితే ఇప్పుడు జగన్ అన్న మాటలు చూస్తుంటే ఏదో కేసీఆర్ ముందు నుంచి పకడ్బందీగా ప్లాన్ చేసి పోలీసుల చేత నిందితులను చంపించి ఒక ఎన్ కౌంటర్ సీన్ క్రియేట్ చేసినట్లు ఉంది అని పలువురు అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని అవకాశం కోసం కాచుకొని కూర్చున్న మానవ హక్కుల కమిషన్ వారు కూడా జగన్ కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సినదిగా సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారని సమాచారం.

 

ఇక ఈ కేసులో మిగిలి ఉన్నది సుప్రీంకోర్టు కేసీఆర్ కు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయడమే. లేకపోతే కనీసం జగన్ అన్న మాటల వెనుక ఉన్న సరైన అర్థం గురించి కూడా వారు కచ్చితమైన స్పష్టత అడుగుతారు. ఏదేమైనా ఒకే ఒక్క దెబ్బతో కెసిఆర్ మరియు జగన్ ఈ కేసులో ఇరుక్కున్నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: