తమపై అసెంబ్లీలో మార్షల్స్ ధౌర్జన్యం చేశారంటూ  చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని టిడిపి సభ్యులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదే అంశంపై  అసెంబ్లీ సమావేశాలను సుమారు గంటన్నర పాటు చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారు. ఉదయం అసెంబ్లీలోకి వచ్చేటపుడు తమ దగ్గరున్న బ్యానర్లను, ప్ల కార్డలను మర్షల్స్ అడ్డుకున్నారంటూ అచ్చెన్నాయుడు గోల మొదలుపెట్టారు. తమ అధినేత చంద్రబాబు విషయంలో మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారంటూ యాగీ మొదలుపెట్టారు.

 

సరే ఇదే విషయమై ఒకవైపు టిడిపి సభ్యులు మరోవైపు మంత్రులు, వైసిపి ఎంఎల్ఏలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. చివరకు చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టేటపుడు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలని డిసైడ్ చేశారు. అందుకనే చంద్రబాబు వచ్చేటపుడు రికార్డయిన వీడియో ఫుటేజీలను తెప్పించారు. ఆ వీడియో ఫుటేజిని అసెంబ్లీలో ప్రదర్శించారు.

 

చంద్రబాబు అసెంబ్లీ దగ్గరకు వచ్చిన దగ్గర నుండి అసెంబ్లీ సిబ్బంది కానీ మార్షల్స్ లో ఏ ఒక్కరు కానీ చంద్రబాబును ఆపలేదు. పైగా చంద్రబాబు చుట్టూ బ్లాక్ క్యాట్ కమేండోలే రక్షణగా ఉన్నారు. పైగా అసెంబ్లీ టిడిఎల్పి కార్యాలయంలోకి వెళుతు అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ జగన్ ను  ఉద్దేశించి  ఉన్మాది అంటూ సంభోదించటం    స్పష్టంగా వినబడింది.  

 

ఎప్పుడైతే అసెంబ్లీలో ప్లే చేసిన  వీడియోలో తను అన్న మాటలు వినిపించాయో తనను మార్షల్స్ అడ్డుకున్నారన్న ఆరోపణలు అబద్ధాలని తేలిపోయాయో చంద్రబాబు నోట మాట పడిపోయింది.  తాను ఏ ఆరోపణలు చేసినా చెల్లిపోతుందని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే బయట మీడియాలో జగన్ పై నోరు పారేసుకున్నట్లే అసెంబ్లీలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీలో సిసి టివిల ఫుటేజీలు ఉంటాయన్న విషయం చంద్రబాబు అండ్ కో మరచిపోయింది. ఎప్పుడైతే ఫుటేజిని తెప్పించి ప్లే చేశారో  చంద్రబాబే కాదు అంత వరకు రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళ నోళ్ళు కూడా మళ్ళీ లేవలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: