నేడు (గురువారం ) అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుపై  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారిగా నేను  ఎమ్మెల్యే అయిన చంద్రబాబు హయాంలో కనీసం ప్రజా సమస్యలుపై మాట్లాడేందుకు మైక్‌ కూడా నాకు అవకాశం కూడా  ఇవ్వలేదని, తాము నిరసన తెలుపుతుంటే ఆ వీడియోలు బయటకు చూపించ లేదు అని బాబుపై మండిపడ్డారు.

 

 
ఇక మార్షల్స్‌ తమతో దురుసుగా ప్రవర్తించారు అని  టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమెఅసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ నుంచి తమను మార్షల్స్‌తో బయటకు పంపారు అని తెలియచేయడం జరిగింది. గతంలో  అసెంబ్లీ వీడియోలు బయటపెడితే తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో బాగా అర్థం అవుతుంది అని రోజా తెలియచేయడం జరిగింది. మరో వైపు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని, మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు చెప్పినా బుద్ధి తెచ్చుకోలేదని మండి పడ్డారు. 

 

రోజు మాట్లాడుతూ... సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర  ఉత్తర్వులు తీసుకొని వచ్చిన కూడా  అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు మార్షల్స్‌ అడుకున్నారని, అప్పటి  తనకు అండగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ఎదుట నిరసన చేసిన కూడా.. స్పీకర్‌ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా రాకుండా బాగా  అవమానించారని, తమ పట్ల ఘోరంగా ప్రవర్తించడం జరిగింది అని  రోజా మండి పడ్డారు.

 

అలాంటిది ఈ రోజు చంద్రబాబు గట్టి గట్టిగా అరుస్తున్నారని, గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించ లేదు అని తెలియచేసింది. మేము  ప్రజలకు మంచి చేస్తుంటే ఎంతసేపు మమల్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని ప్రశ్నించడం జరిగింది. మగధీర సినిమా డైలాగ్‌ల తరహాలో 150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని చంద్రబాబు బీరాలు  పలుకుతున్నారని, వయస్సు మీద పడుతున్న కొద్దీగా కూడా  ఆయనకు చాదాస్తం చాల ఎక్కువ అవుతుంది అని తెలియచేసింది రోజా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: