నాలుగో రోజు ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల వర్షం కురుస్తుంది. అయితే ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరల గురించి ప్రస్తావించారు . ఆమె మాట్లాడుతూ.. నూనె, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి తెలియపరిచారు. అదేవిధంగా పెట్రోలు, గ్యాసు, ఇసుక ధరలు సామాన్య ప్రజల మీద విపరీతమైన భారం మోపుతున్నాయని చెప్పారు. ఈ మండుతున్న ధరలతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని సభాముఖంగా తెలియజేశారు.


అలాగే జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా,  అసలు ఆ ప్రస్తావన తేకుండా ఎంతసేపూ చంద్రబాబు, లోకేష్ మీద విమర్శించడం తప్ప మరేమి చేయట్లేదని విమర్శించారు. ఈ శీతాకాల అసెంబ్లీకి ఒక అర్థం పర్థం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధి మీద అసలు ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇలా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం వలన వచ్చేదేమి ఉండదని ఆమె హితవు పలికారు. ప్రతి కుటుంబానికి పెరిగిన ధరల కారణంగా నెలకు 3500 రూపాయలు ఎక్కువ భారం పడుతుందని వెల్లడించారు.

అదేవిధంగా 6 నెలల క్రితం ఉన్న ధరలకు, ప్రస్తుతం ఉన్న ధరలకి కూడా తేడా చెప్పారు. కందిపప్పు గతంలో 72 రూపాయలు ఉంటే ప్రస్తుతం కేజీ 110 రూపాయలు ఉందని ఆమె తెలియజేశారు. గతంలో నిత్యావసర సరుకుల ధరలు, ఇప్పటి సరుకుల ధరలకు వ్యత్యాసాలు ఎంతగానో పెరిగిపోయాయని తెలిపారు.


ప్రభుత్వం ఏ నిత్య సరుకుల ధరలు పెరుగుతయో...అది ముందుగానే అంచనా వేసుకుని.. ముందస్తుగానే ఆ సరుకులను కొనుగోలు చేసుకొని.. బాగా ధరలు పెరిగిన సమయంలో... ప్రజలకు విక్రయిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారుు. బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కూడా ఇలాంటి పరిస్థితులలో ప్రయోగించటం మంచిదని సూచించారు ఆదిరెడ్డి భవాని.

మరింత సమాచారం తెలుసుకోండి: