అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా, అసెంబ్లీ మార్షల్స్‌ తమ పట్ల దురుసుగా ప్రవర్తిచారని శాసనసభలో టీడీపీ నేతలు అనేక రాద్ధాంతాలు చేయడం జరిగింది. దీనిపై అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్‌ వేయడం జరిగింది. నిన్నటి నుంచి సభలో టీడీపీ సభ్యులు అంతాసభా నియామాలకు అత్యంత విరుద్దంగా ప్రవరిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసాడు. అసెంబ్లీ సమావేశాల సభలో టీడీపీ సభ్యుల ధోరణి చాల భిన్నంగా ఉంది అని అన్నారు. ఇలా వివిధ రీతులలో వ్యవహరించడం సరైన విధానం కాదు అని తెలిపారు. టీడీపీ సభ్యులు కేవలం ఆందోళన చేయడానికే వస్తున్నారా అని  ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

 

మరో వైపు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గారు మాట్లాడుతూ సభా సజావుగా జరుగుతుంటే టీడీపీ అలా మాటిమాటికీ సభలో ఏదో ఒక వివాదం చేయడం సరి కాదు అని అన్నారు. సభా సజావుగా కొనసాగుతుంటే టిడిపి ప్రతిపక్ష పార్టీ సభ జరుగుతుంటే ఓర్చుకోలేకపోతోందని  రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.  ఇది అంత కూడా ఒక ప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యులు ఆందోళన చేయడము పద్ధతి కాదు అని బుగ్గన విమర్శించడం జరిగింది. 

 

 ఈ రోజు ముఖ్యమైన బిల్లులు అన్ని కూడా సభలో ఆమోదం పొందుతాయని తెలియచేయడం జరిగింది. సభలో ముఖ్యమైన బిల్లులను ప్రవేశ పెట్టేటప్పుడు టీడీపీ సభ్యులు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారనిచేస్తున్నారు అని బుగ్గన మండిపడ్డారు. అసెంబ్లీలో విలువైన కాలం విలువ తెలుసుకోవడం అందరి ధర్మము. సెంబ్లీ సమావేశాలు మళ్ళీ మళ్ళీ రావు. అసెంబ్లీ ఆవరణలో పబ్లిక్‌ మీటింగ్‌లపై నిషేధం ఉందని ఆయన గుర్తు చేయడం జరిగింది. అసెంబ్లీ  మార్షల్స్‌ అసెంబ్లీ పరిధిలో ఉన్న నియమాల ప్రకారమే నడుచు కుంటున్నరని బుగ్గన స్పష్టంగా వివరించడం జరిగింది.

 

    ఎటువంటి ఆధారా ల్లేకుండా నిందలు, ఆరోపణలు చేస్తుంటే అధికారులు వాటిని మోస్తూ, చూస్తూ, ఉండాలా? మా హక్కులకు భంగం కలిగితే ప్రశ్నించే హక్కు మాకు లేదా! పరువు న​ష్టం దావా వేసే హక్కు కూడా లేదా? అని సీఎం జగన్‌ సూటిగా ప్రశ్నించారు. నలభై సంవత్సరాల అనుభవం ఉంది  అని చెప్పుకుంటున్న మాజీ సీఎం. చంద్రబాబుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ చురకలు వేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: