జనసేన పార్టీ  ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కు టైం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో ఇంగ్లీషు మీడియంకు మద్దతు ప్రకటించటమే కాకుండా  పవన్  చేయబోతున్న ధర్నాకు హాజరు కావటం లేదని కూడా చెప్పారు.  మొత్తానికి తమ అధినేత పవన్ తో తనకు గ్యాప్ వచ్చిందని స్వయంగా రాపాకే అంగీకరించటం గమనార్హం.

 

స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటంపై జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ ఓ ట్విట్టర్లో ఓ ఉద్యమం  కంటిన్యు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తన వ్యతిరేకతను తెలియజేస్తున్న విషయం తెలిసిందే.  అదే సమయంలో అసెంబ్లీ ఇదే విషయమై జరిగిన చర్చలో రాపాక ప్రభుత్వానికి తన మద్దతు తెలిపారు. పైగా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును సభలోనే తప్పుపట్టారు.

 

ఇక రైతులకు గిట్టుబాటు ధరలకు మద్దతుగా పవన్ తొందరలోనే రాజమండ్రి లేకపోతే కాకినాడలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ధర్నాకు తాను హాజరుకావటం లేదని ఎంఎల్ఏ చెప్పటం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలున్న కారణంగా తాను ధర్నాలో పాల్గొనటం లేదన్నారు. నిజానికి అసెంబ్లీ సమావేశాలకన్నా ఏకైక ఎంఎల్ఏ ధర్నాలోనే పాల్గొనాలి. కానీ తాను అసెంబ్లీ సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పటంలో అర్ధమేంటి ?

 

అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో  జగన్ ను చంద్రబాబు ప్రతి విషయంలోను వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. దానికి వ్యతిరేకంగా చంద్రబాబును రాపాక తప్పుపడుతూ మాట్లాడారు. అంటే జగన్ తరపున చంద్రబాబుకు రాపాక కౌంటర్ ఇస్తున్నారన్నమాట.  అసెంబ్లీలో రాపాక మాట్లాడే  ప్రతి మాట పవన్ కు ఒళ్ళు మండించేదే అనటంలో సందేహం లేదు.

 

సభ బయట చంద్రబాబుకు పవన్ మద్దతిస్తుంటే సభలో చంద్రబాబుకు సొంత ఎంఎల్ఏ కౌంటర్ ఇస్తుండటం చూస్తుంటే ఎన్నో రోజులు రాపాక జనసేనలో కంటిన్యు అవకాశాలు లేవనే అనుమానాలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: