ఇటీవల దిశ  కేసు చాల మలుపులు తిరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే కదా. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టులో గురువారం విచారణ ముగిసింది. న్యాయవిచారణకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 6 నెలల్లో విచారణ ముగించి నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కార్ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉండనున్నారు. కమిషన్ కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీం తెలిపింది. కమిషన్ కు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించాలని కూాడా సుప్రీం ఆదేశించడం జరిగింది.

 

 విచారణ ప్రారంభమైన అనంతరం అసలు ఈ పిటిషన్ ఎందుకు వేశారని పిటిషనర్ జీఎస్ మణిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ పై వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నానని, ఇది బూటకపు ఎన్ కౌంటర్ లా ఉందని పిటిషనర్ అన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని పిటిషనర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నిందితులు తుపాకితో ఫైర్ చేసిన తర్వాతనే పోలీసులు కాల్పులు జరిపారని రోహత్గి వాదించారు. నిందితులు ఫైర్ చేసినప్పుడు బుల్లెట్లు పోలీసులకు తగలలేదని తెలిపారు. దీంతో న్యాయవిచారణకు కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి తెలియచేయడం జరిగింది.

 

ఇక మరో వైపు దిశ సెల్ ఫోన్ ఎక్కడ దొరికింది అనే దాని పై ఇప్పుడు కొత్త విషయం తెరమీదకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం నారాయణ పేట జిల్లాలో పర్యటించింది. దిశ కేసులో ఎన్ కౌంటర్ అయిన నిందితుల గ్రామాలు గుడిగండ్ల, జక్లేరు గ్రామాల్లో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నిందితుల కుటుంబ సభ్యులను అడిగి సమాచారాన్ని సేకరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: