టాలీవుడ్ సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు గారు నేడు చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గొల్లపూడి గారు చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం ఒకింత మెరుగుపడిందని, కాగా నేటి మధ్యాహ్నం హఠాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. వయసు మీద పడడంతో ఆయనకు మందులు కొంత సరిపడలేదని, అందుకే ఆయన హఠాత్తుగా మరణించినట్లు ఆసుపత్రి డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి ఆయన గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. 

 

పలు చిత్రాల్లో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించిన మారుతీరావు గారు మంచి రచయిత, సాహితీవేత్త కూడా. కొద్దిరోజలుగా అనారోగ్యంతో సతమతం అవుతున్న ఆయనను ఇటీవల కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. అయితే అదే సమయంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు నాయుడు గారు ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లి గొల్లపూడి గారిని పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. మారుతీరావు గారు తెలుగు సినిమాకు, అలానే తెలుగు భాష అభ్యున్నతికి చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేవని, తప్పకుండా ఆయన అతి త్వరలో కోలుకుని మళ్ళి మన అందరి మధ్యకు వస్తారని ఉపరాష్ట్రపతి ఆ సమయంలో ఆశాభావం వ్యక్తం చేసారు. 

 

కానీ నేడు ఆయన మనల్ని విడిచి హఠాత్తుగా వెళ్లిపోవడం ఎంతో బాధాకరమైన పలువురు సినిమా రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో పలువురు సినిమా రంగ ప్రముఖులు ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో పుస్తకాలను రచించడంతో పాటు కొన్ని సినిమాలకు కథలు, మాటలు అందించడం, ముఖ్యంగా చిన్న పిల్లలు కథలు రాయడంలో ఎంతో గొప్ప పేరు సంపాదించిన గొల్లపూడి గారు, తెలుగులో ఇప్పటివరకు 250కి పైగా చిత్రాల్లో నటించడం జరిగింది. ఇక నేటి ఆయన మరణ వార్తతో సినిమా ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: