ప్ర‌ముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు తుది శ్వాస విడిచారు.  చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. 250కి పైగా చిత్రాల‌లో న‌టించిన గొల్లపూడి మారుతీ రావు ఏప్రిల్ 14న  విజయనగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.  ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణం లోనే నివాసమున్నారు. మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు.

 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!

 

బ‌హుముఖ ప్రజ్ఞాశాలి అయిన మారుతీరావు  జర్నలిజం, నాటకం, నవల, టీవీ, సినిమా, అన్నిటికీ మించి రేడియో ఇన్ని ప్లాట్‌పారాల మీద రాణించారు. మారుతీరావు అనేక రంగాల్లో రాణిస్తూ, నిష్ణాతులతో కలిసి పనిచేశారు. గొప్పవారితో పనిచేసిన అనుభవం, ప్రావీణ్యం ఆయనను చాలా ఉన్నత స్థాయికి చేర్చాయి. గొల్లపూడి జీవనకాలమ్ పేరుతో ఆయ‌న ర‌చ‌న‌లు ఎంద‌రినో ఆక‌ట్టుకున్నాయి. 

 

కేసీఆర్‌కు కొత్త రోగం..దాని పేరెంటో డాక్ట‌ర్లే చెప్పాలి 

 

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విశాఖ‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ఎంతో ఆర్ద్ర‌త‌తో గొల్ల‌పూడి మాట్లాడారు.  కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న తనకు ఏప్రిల్‌ 14 అంటేనే భయంగా ఉండేదని, ఆ రోజు తాను విశాఖ వెళ్తానోలేదో ఆందోళన చెందేవాడినని చెప్పారు. ‘ఒక దశలో ఆ రోజు తలచుకుంటే పానిక్‌ అయ్యే వాడిని. నిద్రపట్టేది కాదు.. ఆరోజు హాజరు కాగలనా? అని అనిపించేది. ముందు రోజు మధ్యాహ్నం వరకు అపోలోలోనే ఉన్నాను. రెండు రోజులపాటు ఆరోగ్యం బాగుపడాలని కాకుండా 14కి విశాఖ వెళ్లేలా చూడండని వైద్యులను కోరేవాడిని. ఇప్పుడు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఆనందంగాను, గర్వంగాను ఉంది’అని వివరించారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్‌ మరణం తనను కలచివేసిందని గొల్లపూడి మారుతీరావు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: