ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటె తప్ప ఆయనకు నిద్ర రాదు.. ముద్ద దిగదు. అలాంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎప్పుడు ఏదోక వివాదంలో మునిగి తేలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్న ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ తీసి చంద్రబాబుని భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో చిత్రమైన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో చంద్రబాబుని భయపెట్టాడు. 

 

ఎప్పుడులనే ఎన్నో వివాదాల మధ్య పేరు కూడా మార్పు జరిగి ఈరోజు విడుదల అయ్యింది. అయితే నిన్న అర్ధరాత్రి వరుకు రాని సెన్సార్ ఇచివరి క్షణంలో వచ్చి సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం అంటూ ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో చెప్తున్నారు. అయితే ఆ సినిమాలో వర్మ ప్రతాపం చుసిన కొందరు ప్రేక్షకులు సంచలన కామెంట్లు చేశారు. 

 

ఆ కామెంట్లు ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకేం కామెంట్లు అండి బాబు.. అవే రామ్ గోపాల్ వర్మ ఒక దర్శకుడు అయితేనే రాజకీయాల గురించి సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కించాడు.. నిజాలు చెప్పడానికి కాస్త కూడా భయపడకుండా.. వెనకడుగు వెయ్యకుండా ఇలాంటి సినిమాను థియేటర్ వరుకు తీసుకురావడం మాములు విషయాము కాదు.. 

              

ఒకవేళ రామ్ గోపాల్ వర్మ నిజంగా రాజకీయ నాయకుడు అయితే.. అది కూడా వైసీపీలో చేరితే.. ఆహా!! ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ నిజంగానే రాజీకీయనాయకుడు అయితే అద్బుతంగా ఉంటుంది అని.. ప్రతిపక్ష నాయకులను ఏకిపారేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ అభిమాని.. మరి రామ్ గోపాల్ వర్మ రాజకీయాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: