టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ఇసుక కొరతపై దీక్ష నిర్వహించిన‌ విషయం తెలిసిందే. ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 8గంటల వరకు 12 గంటల పాటు విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష చేశారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు దీక్ష  సాగుతుంద‌ని పేర్కొన‌గా...దీనికి కొంద‌రిని పిలిపించి హ‌డావుడి చేయించారు. చంద్రబాబు దీక్షకు జనసేన, లెఫ్ట్‌, ఆప్‌ సంఘీభావం తెలిపాయి. చంద్రబాబుకు దీక్షా ప్రాంగణం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబు దీక్షా ప్రాంగణం వద్ద ఎలాంటి సందడి నెల‌కొందో...స‌రిగ్గా ఇప్పుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. 

 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!

 


ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  రైతు సౌభాగ్య దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో  పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మహిళలు హారతులు పట్టగా.. రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు. రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు ఆకుపచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు  చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు జన సైనికులు, రైతులు భారీగా తరలి వచ్చారు.  రాష్ట్ర నలుమూలల  నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

 

నేను కేటీఆర్ పీఏను...ఓ 90 వేలు అడ్జెస్ట్ చేస్తారా ప్లీజ్‌

ఇసుక దీక్ష‌లో చంద్ర‌బాబు ఇసుక సంచుల మూట‌లు మెడ‌లో వేసుకోవ‌డం...త‌ట్ట‌, పార చేతిలో ప‌ట్టుకోవ‌డం వంటివి మీడియాలో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా ప‌వ‌న్ అదే రీతిలో ప్ర‌వ‌ర్తించారు. వ‌రి కంకులు చేతిలో ప‌ట్టుకొని...వ‌రికంకులు ప్ర‌ద‌ర్శిస్తూ...రైతుల‌తో ప్ర‌సంగింప చేస్తూ..ప‌వ‌న్ దీక్ష సాగింది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌ల మ‌ధ్య అనేక సారుప్య‌త‌లు ఉన్నాయంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: