భారతీయ జనతా పార్టీ మహిళా సంకల్ప దీక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు తెలియచేయడం జరిగింది. చాలా మంది మద్యం తాగడం వల్ల ఎంతో మంది జీవితాలు బలి అయిపోతున్నాయి అని తెలిపారు. ఇక భవిష్యత్తులో ఏ తల్లి కూడా ఆవేదనకూ, మరణనికి మద్యం కారణం కాకూడదని ఆయన ఆశించడం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుదాం అని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారి పోయింది అంటూ బాగా మండి పడ్డారు. 

 

ఎప్పుడూ  హైదరాబాద్‌ బ్రాండ్ అంటూ ట్వీట్‌ చేసే కేటీఆర్‌. ఇప్పుడు తెలంగాణను బ్రాందీ హైదరాబాద్‌గా మార్చి వేయడము జరిగింది అని అన్నారు. రాష్ట్రంలో మద్యం లభ్యతను మొత్తము నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీమంత్రి గారైన డీకే అరుణ గారు దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా దీక్షను మొదలు పెట్టిన లక్ష్మణ్ మీడియాతో మాట్లాడం జరిగింది.


 తాజాగా  దిశ హత్య తర్వాత అన్ని వర్గాల్లో కూడా మద్యంపైనే చర్చలు జరుగుతున్నాయి అని డాక్టరు లక్ష్మణ్‌ తెలిపారు. మద్యం నియంత్రణ చేసే శాఖను, మద్యం పెంచే శాఖగా ప్రభుత్వం మార్చి వేసిందని తెలియచేయడం జరిగింది. నేటి యువత హైదరాబాదులో సాఫ్ట్ వేర్లు గా పనిచేస్తూ డబ్బులు ఎక్కువగా ఈ డబ్బులు వలన క్లబ్బులు, పబ్బులంటూ పాశ్చాత్య కల్చర్‌కు ఎక్కువమంది బానిసలు అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 

 

 అయితే, మేము మాత్రం ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దీక్ష చేయడం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మహిళా సంకల్ప దీక్ష రేప్‌లు, మర్డర్‌లను అరికట్టేందుకే  చేపడుతున్నట్లు స్పష్టం తెలియచేయడం జరిగింది. దేశంలో జరుగుతున్న అరాచక కృత్యాలను అరికట్టేందుకు ఈ మద్యం షాపులు మూసి వేయడం వల్ల కొంతవరకైనా ప్రయోజనము ఉంటుంది అని తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: