దేశంలోనే ప్ర‌భుత్వ బ‌డిలో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్టిన మొద‌టి రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్. కానీ దానికి సంబంధించిన జీవో పాస్ అయిన నాటి నుంచి టీడీపీలో కలవరం మొద‌లైంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ‌పెట్ట‌కుండా ఉండాలని ఈనాడు పేపర్లో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించారు. వ‌రుస‌పెట్టి ఈనాడు ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బ్యాన‌ర్ స్టోరీలు ప్ర‌చురించారు.  ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల్లో తండ్రీకొడుకులు వ‌రుస‌పెట్టి వార్త‌లు రాయించి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో యూట‌ర్న్ తీసుకున్నాడు. న‌వంబ‌ర్ 22న ఆంధ్రం ఆంగ్లం రెండూ అవ‌స‌ర‌మే అంటూ మాట మార్చారు.


 
గత ఐదు సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న చేసే అవ‌కాశం ప్ర‌జ‌లు ఇచ్చినప్పుడు ఇంగ్లిష్ మీడియం తీసుకురాలేక‌పోయాడు. 66% గ‌వ‌ర్న‌మెంట్ స్కూళ్ల‌లో ఇప్ప‌టికీ తెలుగు మీడియం కొన‌సాగుతున్నాయి. అదే ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు చూసుకుంటే కేవ‌లం 28% స్కూళ్ల‌లోనే ఇంగ్లిష్ మీడియం బోధ‌న చేస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్లు లెక్కలు చూస్తే 94 శాతం ఇంగ్లిష్ బోధ‌న చేస్తున్నాయి. 

 

తెలుగు దేశం అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు కొడుకు లోకేష్‌, అచ్చెన్నాయుడు కొడుకు ఇంగ్లిష్ మీడియంలో చ‌ద‌వలేదా అని జగన్ ప్రశ్నిచారు. ప‌త్రిక‌లు న‌డిపే యాజ‌మాన్యాలు కూడా వాళ్ల పిల్ల‌ల్ని ఇంగ్లిష్ లోనే చ‌దివిస్తున్నారు అని గుర్తు చేసారు. రేష‌న‌లైజేష‌న్ పేరుతో 2014-19 మ‌ధ్య‌లో 6 వేల స్కూళ్ల‌ను మూసేశారు ఆ ఘనత టీడీపీ ప్రభుత్వందే.  అందుకే చెబుతున్నా రైట్ ఎడ్యుకేష‌న్ కాదు.. మ‌న రాష్ట్రంలో ఇక‌పై రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేష‌న్ స్టోగ‌న్ రావాలి అని అన్నారు జగన్.

 

మేము అధికారంలోకి వచ్చాక నాడు నేడు కార్య‌క్ర‌మం ద్వారా 44వేల స్కూళ్ల‌ను రెండేళ్ల‌లో మార్చ‌బోతున్నాం. చంద్ర‌బాబు అయిదేళ్లు పాల‌న చేసి క‌నీసం రూ. 50 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. మేము నాడు -నేడు కార్య‌క్ర‌మం ద్వారా రెండేళ్ల‌లో మూడు ఫేజుల్లో 44 వేల స్కూళ్ల‌ను మార్చ‌బోతున్నాం అని స్పష్టం చేసారు. మొద‌టి ఫేజ్‌లో 17,715 స్కూళ్ల‌లో మౌలిక వ‌సతులు క‌ల్ప‌న‌కు రూ. 3,600 కోట్లు కేటాయిస్తున్నాం. జ‌న‌వ‌రి 1 నుంచి అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నాం. మ‌న పిల్ల‌లు ప్ర‌పంచంతో పోటీప‌డేలా స్కూళ్ల‌ను మార్చుబోతున్నాం. విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేస్తున్నాం. ప్ర‌తి మండ‌లంలో ఒక జూనియ‌ర్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. దేశ‌విదేశాల్లో మ‌న పిల్ల‌ల‌కు గుర్తింపు ద‌క్కుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాం కాబ‌ట్టే ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: