టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ పార్ట్ టైమ్ పొలిటీషయన్ గా పాత్ర పోషించి....చంద్రబాబు మీద వాగ వాలనివ్వకుండా కాపాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్...2019 ఎన్నికల తర్వాత మాత్రం ఫుల్ టైమ్ రాజకీయనాయకుడుగా పని చేస్తూ...అధికార వైసీపీ టార్గెట్ గా రాజకీయాలు చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. జగన్ సీఎం అయినది మొదలు....ఆయనపై ఏదొక విమర్శ చేస్తూనే వచ్చారు. అసలు పాలన మొదలు పెట్టి సంవత్సరం కాకుండానే తమ పార్ట్నర్ చంద్రబాబుకు తోడుగా రోడ్లు ఎక్కడం మొదలుపెట్టేశారు.

 

ఎప్పుడు ఏదొక పోరాటం అంటూ రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఇసుక కోసం లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్...ఇటీవల ఉల్లి కొరత అంటూ హడావిడి చేశారు. అటు  జగన్ ప్రభుత్వం రైతుల మేలు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తాజాగా రైతు సౌభాగ్య దీక్ష అంటూ టెంట్ వేసుకుని కూర్చున్నారు. సరే ఏదొక పోరాటం చేస్తున్నారు. దీన్ని అసలు రైతులు పట్టించుకోలేదు అనుకుంటే సొంత వాళ్లే ఈయన పోరాటాన్ని తేల్చేశారు.

 

జనసేనలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఈ దీక్షకు హాజరు కాలేదు. సొంత జిల్లా తూర్పు గోదావరిలో జరుగుతున్నా...అసెంబ్లీ సమావేశాలంటూ రాపాక వరప్రసాద్ తప్పించుకున్నారు. దీనికి తోడు ఇంగ్లీష్ మీడియం బోధన అంశంలో పవన్ కల్యాణ్‌తో విభేదించి.. రాపాక ఆయనకు షాక్ ఇచ్చారు. సరే ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు అనుకుంటే పవన్ సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా దీక్ష రోజే సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. 

 

మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం దిశా చట్టం చేయాలని నిర్ణయించడాన్ని ఆయన అభినందించారు. రాజకీయాలతో సంబంధం లేని విషయమే అయినా.. పవన్ కల్యాణ్ దీక్షకు దిగిన రోజు ఆ దీక్షను పట్టించుకోకుండా జగన్‌ నిర్ణయంపై మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఓ వైపు పవన్,నాగబాబు కాకినాడ దీక్షలో కూర్చుంటే.. చిరంజీవి హైదరాబాద్‌లో ఉండి జగన్‌ను మెచ్చుకుంటూ ప్రకటన విడుదల చేయడం పవన్ కు పెద్ద మైనస్ అయింది. పైగా జగన్ ని సీఎంగా ఒప్పుకోలేనంటూ పవన్ మాట్లాడుతున్న సమయంలో...చిరంజీవి శభాష్ జగన్ అనడం వల్ల పవన్ పరువు పోయినట్లైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: