రాజకీయాల్లో కొందరు నాయకులు ప్రత్యర్ధులపై విమర్శలు చేసే ముందు కొంచెం నోరు జారీ పరుష పదజాలాన్ని వాడుతారు. ఇక మరికొందరు నాయకులైతే అసభ్య పదజాలం కూడా మాట్లాడేస్తుంటారు. సరే మాట్లాడే వాళ్ళు గురించి పక్కనబెడితే ఎప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కొంచెం నోరు జారడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఓటమి ఫలితమో... లేక వయసు మీద పడటమో తెలియదు గానీ బాబు అదుపు తప్పి మాట్లాడేస్తున్నారు. 

 

రాజకీయాల్లో 40 ఏళ్ళు అనుభవం అని చెప్పే బాబు ఈ విధంగా నోరు జారీ మాట్లాడటం పట్ల ప్రజలకు ఒకింత షాకుకు గురువుతున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో అయితే మరి ఆయన ఫ్రస్టేట్ అయిపోతూ.....టంగ్ స్లిప్ అవుతున్నారు. అలా స్లిప్ అయ్యాక అయిన కొంచెం ఆలోచించి అలా మాట్లాడకుండా ఉండాలని చెబుతున్నారా? అంటే అది లేదు. పైగా ఆ మాటలని సమర్ధించుకుంటున్నారు. తాను ఆ మాటలకే కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. 

 

తాజాగా మైక్ ఇవ్వలేదని చెబుతూ...స్పీకర్ పైనే బాబు రంకెలు వేసేశారు. మర్యాదగా ఉండదు.... ఏం మాట్లాడుతున్నావ్ అంటూ స్పీకర్ పై ఫైర్ అయిపోయారు. అయితే దీనిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అంత జరిగిన బాబు మాత్రం క్షమాపణ చెప్పలేదు. చివరికి స్పీకర్ కూడా బాబు విజ్ఞతకే వదిలేస్తున్నాని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి స్పీకరే పట్టించుకోవడం మానేసిన బాబు మాత్రం ఆ మాటకే కట్టుబడి ఉన్నానంటూ మళ్ళీ మీడియా సమావేశంలో చెప్పేశారు. 

 

సరే ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది అనుకుంటే...మళ్ళీ గురువారం మార్షల్స్ పై ఫైర్ అయ్యారు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీలోకి వస్తున్నారని మార్షల్స్ వాటిని తీసి రావాలని చెప్పిన బాబు అండ్ బ్యాచ్ మార్షల్స్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ని పట్టుకుని ఉన్మాది అని సంభోదించారు. ఈ వీడియోని అసెంబ్లీలో ప్లే చేసి అధికార వైసీపీ...చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

అయినా సరే తాను చెప్పానని చెప్పేశారు. అసలు అలాంటి పదాలే మాట్లాడే వ్యక్తి ఇంకా క్షమాపణ ఎందుకు చెబుతాడులే అంటూ జగన్ లైట్ తీసుకున్నారు. మొత్తం మీద అయితే 40 ఇయర్స్ బాబుకు  ఈ మధ్య నోరు జారడం అలవాటైపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: