కొత్తగా అధికారంలోకి రావడమో... లేక కొత్తగా అసెంబ్లీకి రావడామో తెలియదు గానీ.... వైసీపీలో లేడీ ఎమ్మెల్యేలు మొదట్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా హైలైట్ కాలేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేందుకు ఎక్కువ ముందుకు రాలేదు. ఎలా మాట్లాడాలో...ఏం మాట్లాడాలో తెలిసిన అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎదురు నిలబడటానికి కాస్త వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావొస్తుంది. ఈ 7 నెలల్లో తమ సీఎం జగన్ అనేక ప్రజారంజక పథకాలు అమలు చేశారు.

 

పైగా జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షం ఎలాంటి విమర్శలు చేసిన జగన్ కు అండగా నిలవాలి అనుకున్నారేమో గానీ....తాజా అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీలోని లేడీ ఎమ్మెల్యేలు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ప్రతిపక్షం విమర్శ చేయడం ఆలస్యం తమకు అవకాశం దొరకగానే ప్రతిపక్షాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అయితే ప్రతిపక్షాన్ని ఆట ఆడుకోవడంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ముందే ఉంటారు. 

 

అధికారంలోకి వచ్చిన మొదట్లో కొంచెం తగ్గిన రోజా..ఇప్పుడు మాత్రం తగ్గడం లేదు. చంద్రబాబు, లోకేశ్ లపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి సెటైర్లు వేస్తూ చంద్రబాబు గాలి తీసి పారేస్తున్నారు. ఇక రోజాకు తగ్గట్టుగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలు కూడా అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నారు. 

 

ఇటు మంత్రులు పుష్పశ్రీ వాణి, మేకతోటి సుచరితలు తమ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకుంటూనే ప్రతిపక్షంపై ఫైర్ అవుతున్నారు. అటు ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతిలు కూడా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ...జగన్ కు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా వైసీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు తమదైన శైలిలో మాట్లాడుతూ....చంద్రబాబు అండ్ బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్నారు. మొత్తానికి ఏడు నెలల్లో ఎమ్మెల్యేలు రాటుదేలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: