చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తున్నారంటేనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈనెల 16వ తేదీ నుండి చంద్రబాబు మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇప్పటికి ఐదు జిల్లాల్లో పర్యటించారు. కడప, కర్నూలు జిల్లాల్లో సమీక్షల సందర్భంగా తమ్ముళ్ళు చంద్రబాబు ఎదుటే కొట్టేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల సమీక్షల్లో పార్టీ ఓటమికి కారణాలను కార్యకర్తలు నిర్మొహమాటంగా చంద్రబాబు మొహం మీదే చెప్పేశారు.

 

నిజానికి ఈ ఐదు జిల్లాలకన్నా అనంతపురం జిల్లాలోనే చాలా డేంజర్. ఎందుకంటే ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో 14 సీట్లకు గాను 12 సీట్లలో టిడిపి గెలిచింది. అయితే మొన్నటి ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్సయ్యింది. జిల్లాలోని నేతల మధ్య పెరిగిపోయిన గొడవలు, ఒకరిపై మరొకరి ఆధిపత్య ప్రయత్నాల కారణంగా మొత్తం జిల్లాలోనే పార్టీకి దెబ్బ పడిపోయింది.

 

మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి అంటే ఎవరికీ పడదు. అలాగే ఎంఎల్ఏల్లో చాలామందితో జేసి కుటుంబానికి పడదు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో  చంద్రబాబు అందరికీ టికెట్లు ఇచ్చారు. దాంతో ఒకరి ఓటమికి మరొకరు తీవ్రంగా కష్టపడ్డారనే ప్రచారం జరుగుతోంది. సరే అభ్యర్ధుల ఓటమికి ప్రతీ ఒక్కళ్ళూ యధాశక్తి పార్టీపైనే బండాలేయటంలో అందరూ సక్సెస్ అయ్యారు.

 

ఎప్పుడైతే చాలామంది ఓడిపోయారో నేతల మధ్య వివాదాలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్న సందర్భంలో చంద్రబాబు పర్యటిస్తుండటంతో ఎవరికేమి జరుగుతుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.  చంద్రబాబు పర్యటన కారణంగా అందరు నేతలు ఒకచోట చేరుతారు. పైగా మూడు రోజులు. దాంతో ఒకళ్ళపై మరొకరి ఫిర్యాదులు తప్పదు. దాంతో ఎవరిపై ఎవరు దాడులు చేసుకుంటారో అర్ధం కావటం లేదు. కడప, కర్నూలు జిల్లాల్లో జరిగిందిదే. చూద్దాం మూడు రోజుల్లో ఏమవుతుందో ?

============

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: