తెలంగాణలో హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కొన్ని నెలల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వీడి కామ దాహానికి బలైన బాధిత యువతుల కుటుంబాలు శ్రీనివాస్ రెడ్డిని తక్షణం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇకపోతే ఇతగాడి విషయంలో దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు చేయాలని వారి కుటుంబీకుల నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 

 

ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న బాధితులు కూడా తమ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి రాక్షసులను కూడా ఇదే రీతిలో ఎన్‌కౌంటర్ చేసి తీరాలని పట్టుబడుతున్నారు.  ఇకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో పదో తరగతి విద్యార్థిని శ్రావణిని శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం, హత్య చేశాడు.

 

 

ఈ ఘటన గత ఏప్రిల్‌ 25న జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో శ్రీనివాస్ రెడ్డి గతంలో మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా ఇదే రీతిలో హతమార్చినట్లు తేలింది. ఈ మేరకు కల్పన, మనీషా అనే బాలికలను హత్య చేసి, మృత దేహాలను బావిలో దాచినట్లుగా ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడు. ఆగ్రహించిన గ్రామ ప్రజలు ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు..

 

 

ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి రాక్షసత్వం బయటపడి 8 నెలలు అవుతున్నా విచారణ పేరుతో బాగా జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే వరంగల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శ్రీనివాస్ రెడ్డి పై జరిగిన  ఫాస్ట్‌ట్రాక్  కోర్టు విచారణ ముగిసింది. ఈనెల 29 న గానీ 30 వ తారీఖున గానీ తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు అధికారులు..

 

 

ఇకపోతే ఈ కేసు విచారణ గత అక్టోబర్ 14 నుండి కొనసాగుతుంది.. ఇక నలుగురి బాలికల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస రెడ్డిని అనవసరంగా మేపు తున్నారని కొందరి విషయల్లో త్వరగా నిర్ణయం తీసుకుని, మరి కొందరి నేరస్తుల విషయంలో జాప్యం చేస్తే ఇలాంటి మృగాలకు భయం ఎక్కడ ఉంటుందనే ప్రశ్న ఇప్పుడు కొందరి ఆడపిల్లల మనసులో ఉదయిస్తుందట అని అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: