తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది విజయవాడే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్రంగా తెలుగుదేశం హయా౦లో ఆ పార్టీకి అండగా నిలిచే సామాజిక వర్గాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ విషయంలో బాగానే లాభపడ్డాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందారు అనే చెప్పాలి. 

 

అందుకే ఆ పార్టీకి ఈ ప్రాంతంలో కాస్త మద్దతు ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడం, ఇక్కడ నాయకులు కూడా బలమైన వారు ఉండటంతో ఆ పార్టీ ఇక్కడ చక్రం తిప్పింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పార్టీ చాలా కష్టాలే పడుతుంది. విజయవాడలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ పార్టీ నేడు సరైన నేత లేక అవస్థలు పడుతుంది. 

 

గద్దె రామ్మోహన్, కేసినేని నాని ఉన్నా సరే కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. బలమైన యువనేతగా ఉన్న దేవినేని అవినాష్ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు క్యాడర్ లో సరికొత్త ఆందోళన మొదలయింది. విజయవాడను ప్రభుత్వం అభివృద్ధి చేసే అవకాశం లేదని, రాజధాని విషయంలో వెనక్కు తగ్గుతుందని భావించారు అంతా... కాని ఇప్పుడు ఇక్కడ వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా... అందరికి ఆమోదయోగ్యంగా పరిపాలన చేస్తుంది ప్రభుత్వం అనే పేరు కూడా వచ్చింది. 

 

ఇక బలమైన నేతలు అందరూ కూడా ఆ పార్టీ వైపే చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేయడంతో ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నాయి. దీనితో పార్టీ ఏ విధంగా బలపడుతుంది అనే ఆందోళన క్యాడర్ లో ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌రి కొంద‌రు పార్టీ నేత‌లు కూడా పార్టీని వీడ‌తార‌ని టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: