తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ముందు వరుసలో ఉంటుంది. పరిటాల రవి పుణ్యమా అని ఈ జిల్లాలో పార్టీ ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఆయన చరిష్మాతో పార్టీ దుమ్ము రేపింది... కాని ఆయన తర్వాత ఆ స్థాయిలో జిల్లాలో మరో నేత కనపడలేదు. అయినా సరే క్యాడర్ ఉండటంతో ఇన్నాళ్ళు జిల్లాలో చక్రం తిప్పింది ఆ పార్టీ. గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధిస్తుందని, కృష్ణా నీళ్ళు వచ్చాయని, కియా వచ్చిందని చంద్రబాబు నుంచి కింద వరకు ప్రతీ ఒక్కరు నమ్మేశారు.

 

కాని పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా మారాయి అనేది వాస్తవం... జగన్ హవా ముందు తెలుగుదేశం తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే ఇప్పుడు ఆ పార్టీని జిల్లాలో సమర్ధవంతంగా నడిపించే నేత కావాలి... పార్టీ క్యాడర్ కి ధైర్యం ఇస్తూ ముందుకి నడిపించి మళ్ళీ సత్తా చాటే స్థాయికి తీసుకొచ్చే నేత కావాలి... కాని ఆ పరిస్థితులు ఇప్పుడు జిల్లాలో కనపడటం లేదు. ఇన్నాళ్ళు పరిటాల కుటుంబం ఉందని భావించినా వాళ్ళు కంచుకోట లాంటి నియోజకవర్గంలో దారుణంగా ఓటమి పాలు కావడం ఇబ్బంది పెట్టింది.

 

దీనితో వాళ్ళు కూడా పార్టీ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు... ఇక జేసి కుటుంబం ఉన్నా సరే వాళ్ళు చేసిన అక్రమాల మీద ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. దీనితో వాళ్ళు కూడా పార్టీ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపధ్యంలో జిల్లాలో ఈ రెండు కుటుంబాలు కాడి పడేసినట్టే అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనంతపురం పార్లమెంట్ గాని, హిందూపురం పార్లమెంట్ లో గాని ఏ ఒక్క బలమైన నేత కనపడటం లేదు. ఇప్పుడు ఇదే ఆ పార్టీ క్యాడర్ ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇలా అయితే భవిష్యత్తు ఎలా అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: