ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే యువనేతలకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ప్రతీ జిల్లాలో కూడా యువనేతలకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న నేతలు అందరూ కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలే. రాజకీయంగా ఆ పార్టీని ఇన్నాళ్ళు మోసిన నేతలు కూడా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ కాలం చెల్లింది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా యువనేతలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళ నాయకత్వంలో పార్టీ ముందుకి వెళ్ళాలి... పార్టీ క్యాడర్ కి వాళ్ళు ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

 

నియోజకవర్గాల బాధ్యతలను, జిల్లాల బాధ్యతలను వారికే ఇవ్వాల్సి ఉంటుంది... కాని ఇప్పుడు చంద్రబాబు ముందు ఒక కొత్త కష్టం వచ్చింది. రాష్ట్ర౦లో యువనేతలు ఆ పార్టీకి ఎక్కడ చూసినా కనపడటం లేదు. చివరకు చంద్రబాబు సొంత జిల్లాలో కూడా ఆ పార్టీకి యువనేతలు కరువు అయ్యారు అనేది వాస్తవం. ఇక కృష్ణా జిల్లాలో కూడా ఎవరూ కనపడట౦ లేదు.

 

గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం, ఇలా ఏ జిల్లాల్లో చూసినా యువనేతలు కనపడట౦ లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్ళిన చంద్రబాబు వెంట అందరూ సీనియర్ నేతలే ఉన్నారు గాని, యువనేతలు అనే వారు ఎక్కడా కనపడ లేదు. దీనితో క్యాడర్ లో కూడా ఒకరకమైన ఆందోళన వ్యక్తమవుతుంది. సీనియర్ నేతల వారసులు మినహా స్వతహాగా ఎదిగే నేతలు ఒక్కరు కూడా లేరు.

 

దీంతో అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే యువనేతలు జాబితా చంద్రబాబు ముందు ఉన్నా సరే... వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఇప్ప‌ట‌కీ అయినా వీరి విష‌యంలో బాబు డేరింగ్ డెసిష‌న్ తీసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇదే మరికొంత కాలం కొనసాగితే మాత్రం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: