ఏపీ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల వాక్బాణాలతో రణరంగాన్ని తలపిస్తోంది. కానీ ఈరోజు సభలో బియ్యపు వారి కథకు అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేశారు. ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం పై ఈరోజు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్యెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనకు ఇంగ్లీష్ రాని కారణంగా ఏం ఇబ్బందులు ఎదుర్కొన్నారో చెప్పారు.

 

"అధ్యక్షా నేను ఈ మధ్య ఒక పని మీద అమెరికా వెళ్ళాను, అక్కడ నన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికాకు ఎందుకు వచ్చావు అని అడిగారు, అసలే నేను ఇంగ్లీషులో వీక్, నా వచ్చీ రని ఇంగ్లీష్ తో వాళ్లకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు, ఇక తప్పదు అనుకుని నాకు వచ్చిన ఇంగ్లీష్ లో ఈజ్ కమింగ్ అమెరికా బిగ్ మీటింగ్ గ్యాదరింగ్ అని చెప్పాను దీనితొ వాళ్ళు ఉన్నటుండి నన్ను ఎత్తుకెళ్ళి ఓ పక్కన పడేసారు, అధ్యక్షా నిజం చెప్తున్నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. వెంటనే నాకు తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి ఏం ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలని అడిగాను ఆయన చెప్పమన్నట్లు చెప్పాను" అంటూ నవ్వులు పూయించారు బియ్యపు మధుసూదన్ రెడ్డి.

 

ఈరోజు పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ చాలా ముఖ్యమని తెలుగు వాళ్ళకి అద్భుతమైన సబ్జెక్టు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ రాని కారణంగా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన మనవడికి ఇంగ్లీష్ తో పాటు చైనీస్ భాష ను కూడా నేర్పిస్తున్నారని చెప్పారు. అందరికీ ఉపయోగపడేలా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బళ్ళల్లో ప్రవేశపెడుతున్న జగన్ గారిని అభినందిచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొత్తానికి రోజూ మాటల యుద్ధం జరిగే అసెంబ్లీలో ఈరోజు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన కథ తో నవ్వులు పూయించారు. ఎప్పుడూ గంభీరంగా వుండే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా మధుసూదన్ రెడ్డి కథకి నవ్వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: